United States Elections :అక్కడ ఏలేది మనోళ్ళే..!!
అమెరికా అధ్య క్ష ఎన్ని కలకు మరో రెండేళ్లు సమయం వుండగానే అక్కడి రాజకీయ పార్టీలు, నేతలు అప్పుడే దానిపై దృష్టిపెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
రిపబ్లికన్ పార్టీ నుంచి..
- మాజీ అధ్యక్షుడు ట్రంప్
- నిక్కీ హేలీ
- వివేక్ రామస్వామి
డెమొక్రాటిక్ పార్టీ తరఫున..
- జో బైడెన్..
- కమలా హ్యారీస్..
- రో ఖన్నా
తగ్గేదే లే : ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంకా వైట్ హౌస్ మీద ప్రేమ తగ్గలేదు తెంపరి తనంతో దూకుడైన నిర్ణయాలతో అమెరికన్లనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఒక ఆటాడుకున్నారు. చివరకు 2020లో ఓడిపోయే సమయంలో ఏకంగా క్యాపిటల్ భవనంపై తన అనుచరులతో విధ్వంసం సృష్టించాడు. ఓవల్ ఆఫీస్‌ను వీడిపోయే సమయంలో కీలకమైన డాక్యుమెంట్లను కూడా పట్టుకొని పోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఓడిపోయాడు కదా.. ఇక ట్రంప్ గోల తప్పిందిలే అని అమెరికన్లు భావిస్తున్న వేళ.. ఆశ్చర్యకరమైన ప్రకటన తో రాజకీయ వర్గాలు వ్యాపార వర్గాల తో పాటు సాధారణ పౌరులు సైతం విస్మయానికి లోనైనారు . ట్రంప్ చర్య విశ్లేషకుల ఉహలకు సైతం అంతు చిక్కటంలేదు.
నిక్కీ హేలీ :
ఇండో అమెరికన్ నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. సౌత్ కరోలినాలోని బాంబెర్గ్‌లో 1970లో ఇండో-అమెరికన్ కుటుంబంలో నిక్కీ జన్మించారు. క్లెమ్సన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన ఆమె కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. 2010లో ఆమె సౌత్ కరోలినా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా చరిత్రలో తొలి మైనార్టీ మహిళా గవర్నర్‌గా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. 2014లోనూ ఆమె గవర్నర్‌గా ఎన్నికయ్యారు. టైమ్స్ మ్యాగజీన్ ప్రపంచంలోని వంద మంది ప్రభావశీలురుల్లో ఒకరిగా నిక్కీని గుర్తించింది. ‘నూతన తరం’ నాయకురాలిగా. ‘నేను అధ్యక్ష పదవి రేసులో ఉన్నాను. దేశ సరిహద్దులను కాపాడటం కోసం, ఆర్థికంగా బాధ్యతాయుతంగా ఉండటం కోసం, మన దేశాన్ని బలోపేతం చేయడం కోసం, మన ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి నూతన తరం నాయకత్వ పగ్గాలు చేపట్టాల్సిన సమయం వచ్చింది’ అని నిక్కీ తెలిపారు. భారత్ నుంచి వలస వచ్చిన వారి కుమార్తెనని చెప్పుకోవడానికి గర్విస్తున్నా నల్లజాతి కాదు, శ్వేత జాతి కాదు.. ఇది భిన్నమైంది’ అని నిక్కీ తన భారతీయ మూలాల గురించి గర్వంగా చెప్పుకున్నారు. ‘వైరుధ్యాల మీద కాకుండా సారూప్యతల ఆధారంగా విధాన నిర్ణయాలు అమెరికాను మరింత ప్రగతి పధంలో నడిపిస్తాయి అనేది నేను నేర్చుకున్న సిద్దాతం అని పేర్కోన్నారు
వివేక్ రామస్వామి:
అదే పార్టీ నుంచి 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని యువ మిలియనీర్, టెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి ప్రకటించారు. వివేక్ రామస్వామి తల్లిదండ్రులది కేరళ రాష్ట్రం. వారు అమెరికాకు వలస వెళ్లారు. వివేక్ ఒహియోలోని సిన్సినాటిలో జన్మించాడు. ప్రస్తుతం అతనికి వయస్సు37 సంవత్సరాలు . అతని తండ్రి ఒహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. రామస్వామి ఒక ప్రముఖ బయోటెక్ వ్యవస్థాపకుడు కూడా.
జో బైడెన్ :
అమెరికాలో 2024లో నిర్వహించే అధ్యక్ష ఎన్నికల రేసులో మరోసారి జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రెండోసారి తాను పోటీ చేయాల్సి వస్తే ఉపాధ్యక్ష అభ్యర్థినిగా కమలా హ్యారిస్ ఉంటారని స్పష్టం చేశారు. సాధారణంగా- అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన నాయకుడు.. రెండోసారి కూడా ఎన్నికల్లో పోటీ పడటం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సంప్రదాయాన్ని బైడెన్ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.
కమలా హ్యారిస్ :
కమలా హ్యారిస్ తండ్రి డోనల్డ్ హ్యారిస్‌ది జమైకా కాగా, తల్లి శ్యామలా గోపాలన్‌ది చెన్నై. శ్యామల 1960లో చెన్నై (మద్రాస్) నుంచి అమెరికాకు వలస వచ్చారు. కమలా హ్యారిస్ కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో జన్మించారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ దక్కి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడి విజయం సాధిస్తే ఈ పదవిని చేపట్టే తొలి మహిళ ఆమే అవుతారు ఉపాధ్యక్షురాలు గా ప్రస్తుత పనితీరు ఆనుభవం కమలా హ్యారిస్ కి కలిసి వచ్చే ఆంశాలు
రో ఖన్న :
సెనేట్‌కు పోటీ చేయాలని భావిస్తున్న ట్లు ప్రకటిం చారు. ఖన్నా మాటతో డెమొక్రాట్లుఉలిక్కి పడ్డారు.అమెరికా అధ్య క్ష బరిలో నిలిచేం దుకు భారత సంతతికి చెం దిన రో ఖన్నా సిద్ధంఅవుతున్నారనే ప్రచారం సాగుతోంది. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుం చి ప్రతినిధుల సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నా రు. వచ్చేఎన్ని కల్లో సెనెట్‌కు పోటీ చేయడం పై ఆలోచిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పా రు ప్రస్తుతం కాలిఫోర్ని యా, పెన్సిల్వేనియాలో ఒక సాధారణ భారతీయ పంజాబీ కుటుంబం లో జన్మించారు. అతని తల్లిదండ్రులు పంజాబ్ నుం డి అమెరికాకు వలస వచ్చారు. రో ఖన్నా తండ్రి కెమికల్ ఇంజనీర్, అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుం డి పట్టభద్రుడయ్యా డు. ఆ తర్వాత మిచిగాన్ విశ్వ విద్యా లయంలో పట్టభద్రుడయ్యా డు. అతని తల్లి మాజీఉపాధ్యా యురాలు.. రో ఖన్నా ఎం పీ కాకముందు స్టాన్‌ఫోర్డ్ విశ్వ విద్యా లయంలో బోధిం చేవాడు. దీంతో పాటు ఒబామా ప్రభుత్వం లో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉంది. రో ఖన్నా చికాగో విశ్వ విద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో భా యేల్ విశ్వ విద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు.
ఏది ఎమైనా ఓబామ తర్వాత ఆమెరికన్లని ఏవ్వరూ ఆంతగా ప్రభావితం చేయ్యలేదనే చెప్పాలి. ట్రంప్ భారత దేశంతో అశించినంత మేరకు సంబంధాలని కొనసాగించలేదనే చెప్పాలి. ఈ దిశగా జో బైడెన్ మెరుగైన తీరును కనబరుస్తున్నారు. విమానయాన రంగంలో బోయింగ్ ఎయిర్‌బస్ సంస్థల నుంచి 470 కొత్త విమానాలను కొనుగోలుకు ఒప్పందం వల్ల ఈ కొనుగోలు 44 రాష్ట్రాలలో ఒక మిలియన్ అమెరికన్ ఉద్యోగాలకు మద్దతు ఇస్తుంది పరస్పర ప్రయోజనకరమైన రెండు దేశాల మధ్య శక్తివంతమైన ఒప్పదం గా బైడెన్ చేసిన ప్రకటనే సాక్ష్యం . రానున్న కాలంలో ఆక్కడ ఏలేది మనోళ్ళే..
– శ్రీధర్ వాడవల్లి – హైదరాబాద్