Alia Bhatt : బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటనకీ, అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇటీవల ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇటీవలే ప్రేమించిన రణ్ బీర్ ని పెళ్లి చేసుకొని పండంటి బిడ్డకు తల్లయ్యింది అలియా. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోన్న అలియా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా తన గారాలపట్టి ‘రాహా’ తనలా సినిమా రంగాన్ని ఎంచుకోవాలని కోరుకోవడం లేదని తెలిపింది.

తన కూతురు బాగా చదువుకుని గొప్ప పరిశోధనలు చేసే సైంటిస్టు కావాలన్నది తన అభీష్టమని చెప్పుకొచ్చింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పదేళ్లలో నీ జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. నిద్రమానుకుని ఏకధాటిగా సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా కంటూ ఓ కుటుంబం ఉంది. అలా అని సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇవ్వను. కెరీర్, కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని’ చెప్పుకొచ్చింది.
Infosys Sudha Murthy : ఆ మూవీతో అలియా ఏడ్పించేసింది..
ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆలియా కరణ్ జోహార్ చిత్రం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వుంది. ఈ చిత్రం జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ, రణ్వీర్ సింగ్ తదితరులు కీలకపాత్రలో నటించారు. దీంతో పాటు ‘హార్ట్ స్టోన్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది అలియా.