Allu Arjun : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిసినెస్ లోనూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే AAA మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా బన్నీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ జాతకంలో పెద్ద దోషం ఉందని తన ఫ్యామిలీ పూజారి చెప్పుకొచ్చాడట. అంతేకాదు త్వరలో ఇండస్ట్రీని ఏలబోయే రారాజు అల్లు అర్జున్ అని.. అలాంటి బన్నీకి నరదిష్టి ఉందని ఆ పూజారి చెప్పాడట. అందుకు పరిహార పూజలు చేయాలని లేకపోతే ఆయన సినిమాల పరంగా టఫ్ లైఫ్ ఎదుర్కోవాల్సి వస్తుందట. లేదంటే.. నెంబర్ వన్ స్థానం రాకపోయే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడంట ఆ పూజారి.
Sreemukhi Hot Pics : కూల్ క్లైమేట్ లో శ్రీముఖి హాట్ పిక్స్..
దీంతో రాత్రికి రాత్రి అల్లు అర్జున్ వాళ్ల అమ్మ, బన్నీని తన ఫామ్ హౌస్కి తీసుకెళ్లి పూజలు చేయించిందంట. ఈ పూజలో బన్నీ, స్నేహ, అల్లు అర్హ, ఆయాన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న బన్నీ, నెక్స్ట్ త్రివిక్రమ్ తో AA22 పాన్ ఇండియా మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు నెక్స్ట్ లేవేల్ లో ఉన్నాయి.