Infosys Sudha Murthy : సుధామూర్తి.. ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్యగా మాత్రమే కాకుండా, ఆమె రచనలు, పుస్తకాలు, ఆమె చేసే సేవా కార్యక్రమాలతో అందరికీ సుపరిచితమే. ఒక విలువలు గల మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని ఆమె జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఆమె చెప్పే జీవిత పాఠాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. సుధామూర్తి మంచితనం, మానవత్వం ఉన్న మనిషి. ఇప్పటికే పలు అనాథశ్రమాలను ప్రారంభించారు.

అలాగే గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడ్డారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. ఇక ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన సుధామూర్తి ఇప్పటి వరకు చాలా సంఘటనలు చూశాను కానీ ఎప్పుడు కంటతడి మాత్రం పెట్టుకోలేదు. తాజాగా ‘రాజీ’ మూవీలో అలియా యాక్టింగ్ చూసి ఏడ్చేశాను అని చెప్పారు.
Urfi Javed : పబ్లిక్ ఫిగర్ నే కానీ.. పబ్లిక్ ప్రపార్టీని కాదు..
అలాగే నేను థియేటర్లో 1958లో తొలిసారిగా సినిమా చూశాను. అప్పటినుంచి వైజయంతీమాలను అభిమానించడం ప్రారంభించా. ఈ తరంలో మాత్రం అలియా నటనను అభిమానిస్తా. నిజంగా తాను గొప్ప యాక్టర్ అని పేర్కొన్నారు సుధామూర్తి. అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజీ మూవీకి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. 1971 నాటి ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గూఢచర్యం, కుటుంబ భావోద్వేగాల మధ్య ఓ అమ్మాయి పడిన వేదనను తెరపై చక్కగా ఆవిష్కరించారు.
Breakfast : అల్పాహారంతో అధిక బరువుకు చెక్ పెట్టండిలా..
