Kichcha Sudeep : ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ అందరికి సుపరిచితుడే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా విక్రాంత్ రోణా మూవీతో మంచి కమర్షల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత కాస్తా గ్యాప్ ఇచ్చిన సుదీప్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా సుదీప్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు నిర్మాతలు. సినిమా చేస్తాను అని అడ్వాన్స్ తీసుకొని సినిమా ఎగ్గొట్టారని ఆరోపించారు నిర్మాతలు.

ఎనిమిదేళ్ల కింద కిచ్చా ఓ సినిమా చేసేందుకు ఆ నిర్మాతలతో అంగీకరించారు. కాగా, ఇప్పటి వరకు వారికి డేట్స్ ఫిక్స్ చేయలేదు. కోటిగొబ్బ3, విక్రాంత్ రోణ చిత్రాల తర్వాత తమతోనే సినిమా చేస్తానని హామీని కూడా ఇచ్చారు. ఇదే విషయమై సుదీప్ ను కలిసేందుకు ప్రయత్నించినా రెస్పాండ్ కావడం లేదని ఆరోపించారు. అయితే తనపై ఆరోపణలు చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్లపై కిచ్చా సుదీప్ ఫైర్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు సుదీప్.
తన పై ఆరోపణలు చేసిన వారి పై సుదీప్ పరువు నష్టం దావా వేశారు. ఆ నిర్మాతల పై రూ.10 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేశాడు సుదీప్. అలాగే తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ వాళ్లు నోటీసులకు అనుగుణంగా స్పందించడంలో విఫలమైతే.. తాను ఆ ఇద్దరిపై క్రిమినల్, సివిల్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తానని కూడా ఈ లీగల్ నోటీసుల్లో తెలిపాడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు సుదీప్. ఈ విషయం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.