Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ హీరోగా మాత్రమే కాకుండా మనసున్న వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సొంతూరు బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని సిద్ధాపూర్ గ్రామాన్ని కూడా మహేశ్ బాబు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా, మహేశ్ బాబు ఫౌండేషన్ (Mahesh Foundation) ద్వారా ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో వందలాది చిన్నారులకు హృద్రోగ సంబంధిత ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారు.

ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూ.. మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కూల్ డ్రింక్స్, ఫుడ్, దుస్తులు, వాచెస్ ఇలా అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే తాజాగా పేద పిల్లలకు వైద్యాన్ని అందించే ‘Heal a Child’ అనే ఓ ఎన్జీఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. సోమవారం జూలై 10 ఈ సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి మహేష్ తన భార్య నమ్రతతో కలిసి హాజరయ్యారు.
Tollywood : టాలీవుడ్ ఈ లోపాలను అధిగమించేది ఎప్పుడో..?
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతుండగా మహేష్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో అనేక సీన్లు మళ్లీ రీషూట్ చేస్తున్నారు. హీరోయిన్ పూజ హెగ్డే ప్లేస్ లో శ్రీలీలను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB29 లో నటించనున్నాడు.