Prabhas Ad : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆరడుగుల అందగాడు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. సినిమా.. సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒక సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండగానే నాలుగైదు సినిమాలు లైన్ లో ఉన్నాయంటే.. ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ యాడ్ చేసాడు అంటే ఆ యాడ్ ఏంటీ, ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే అతిశయోక్తి అందరికీ ఉంటుంది. అదేంటో చూద్దాం.. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయినప్పటికీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఎన్నడూ లేనిది ప్రభాస్ యాడ్స్ కనిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ మేరకు మహీంద్రా కారుకు సంబంధించిన యాడ్లో ప్రభాస్ మెరిసాడు. అచ్చం సినిమా స్టైల్లో ఉన్న ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. ఈ యాడ్ కి ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం. పెద్ద పెద్ద స్టంట్లు ఉన్న యాడ్ అయినప్పటికీ దీనికి ఒక్క రూపాయి పారితోషికం తీసుకోలేదట. యాడ్ ప్రమోటర్స్ తీసుకోమని ఎంత చెప్పినా డార్లింగ్ నో చెప్పాడట.