Prabhas Facebook Hacked : ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సినిమా కల్కి 2898 AD. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలావుండగా నిన్న ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యింది. అడవుల్లో సైక్లింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన యువకుల దృశ్యాలు, రోడ్డు ప్రమాదాలు, ఫన్నీ మూమెంట్స్ ఇలా సంబంధం లేని పోస్ట్ లు గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఎఫ్ బి పేజీలో దర్శనం ఇస్తున్నాయి. ఆ వీడియోకి ‘మనుషులు దురదృష్టవంతులు’ (Unlucky Humans) అని క్యాప్షన్ ఉండటంతో.. అభిమానులు షాక్ అయ్యారు.
Bro The Avatar : బ్రో టైటిల్ కి ముందు ఏమనుకున్నారో తెలుసా..!?
వెంటనే డార్లింగ్ FB ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ట్వీట్స్ పెట్టారు. వెంటనే అప్రమత్తమైన ప్రభాస్ టీం సమస్యను పరిష్కరించింది. పదేళ్ల క్రితం ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ప్రభాస్ కు 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన మాత్రం కేవలం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. తన సినిమా విశేషాలు, నటీనటులకు శుభాకాంక్షలు చెప్పడానికి ఈ సోషల్ మీడియా అనుసంధాన వేదికను ఉపయోగించుకుంటున్నాడు.