Regina Cassandra : అ, ఎవరు, నగరం వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసాండ్ర. ఎస్ ఎమ్ ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో సానా కష్టం వచ్చిందే మందాకిని అనే ఐటెం సాంగ్ కూడా చేసింది. ఆ మధ్య రెజీనా, నివేతా థామస్ కలిసి నటించిన
శాకిని డాకిని తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు రెజీనా. తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై బాగా దృష్టి పెట్టింది రెజీనా. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా రెజీనాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ బ్యూటీకి చిన్నప్పటి నుంచే హీరోయిన్ అవ్వాలని కలలు కనేదట, అంతేకాకుండా గ్లామర్ ప్రపంచంలోకి రావాలని చాలా కోరుకుందంట.
Ram Charan 1st Remuneration : రామ్ చరణ్ మొదటి సంపాదనతో ఏం చేసాడో తెలుసా..!?
చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి తెలియక, తను కూడా సన్నీలియోన్ లాగా హాట్ స్టార్ గా, పోర్న్ స్టార్ గా పేరు తెచ్చుకోవాలని ఉందని చెప్పుకునేదట. ఇక దాని అర్ధం తెలిసిన తర్వాత షాక్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది రెజీనా. అంతే కాకుండా బోల్డ్ సీన్స్ చేయడం పూర్తిగా కల్పితమే కదా.. అలాంటప్పుడు ఆ పాత్రల్లో నటించడంలో తప్పేముంది అంటూ రెజీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.