S S Rajamouli Ad Remuneration : ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. ‘బాహుబలి’ నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేసాడు రాజమౌళి. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా కంటిన్యూ అయిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ మారిపోయారు.
ఆ తర్వాత వచ్చిన RRR మూవీతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగోడి సత్తా ఏంటో చూపించారు. అయితే హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు వాణిజ్య ప్రకటనల్లో నటించడం కామన్. కానీ దర్శకులు యాడ్స్ లో నటించడం చాలా అరుదు. అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి తాజాగా ఓ యాడ్ ఫిలింలో తళుక్కుమన్నారు. తొలిసారి ఆయన ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం యాడ్ లో నటించారు.
ఈ యాడ్ షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది. రాజమౌళి ఒకొక్క సినిమాకు సుమారు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అలాంటిది యాడ్ కోసం జక్కన్న ఎంత తీసుకున్నాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ యాడ్ కోసం రాజమౌళి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ యాడ్ రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యింది. ఈ యాడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపించారు జక్కన. నెక్స్ట్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
@ssrajamouli brand new add for Oppo Reno 10 Series.#SSRajamouli #Oppo #HittuCinma pic.twitter.com/WWsNL22idm
— Hittu Cinma (@HittuCinma) June 28, 2023