Yogi Babu Remuneration : కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ కమెడియన్ గా యోగిబాబుకు మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. యోగిబాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. 2009లో తమళి యోగి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యోగిబాబు.. తన కామెడీతో అనేక ఆఫర్లు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. స్టార్ హీరోల సినిమాల్లో యోగిబాబు పక్కగా ఉంటారు.
ఆయన కోసమే కథలో ఓ కామెడీ ట్రాక్ ను రాస్తుంటారు దర్శకులు. దళపతి విజయ్ నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాడు యోగిబాబు. ఇదిలా ఉంటే యోగిబాబు రెమ్యునరేషన్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. యోగిబాబు ఒక్కరోజుకి 18లక్షల తీసుకుంటూ, దాదాపు 10కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని సమాచారం. ఇది కొంతమంది హీరోలు అందుకునే రెమ్యునరేషన్ తో సమానం. ఆ మధ్య యోగిబాబు హీరోగా నటించిన మండేలా మూవీలో నవ్విస్తూనే ఆలోచింపజేసాడు.