• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Reviews

Bro The Avatar Review : పవర్ స్టార్ ‘బ్రో’ రివ్యూ & రేటింగ్..

R Tejaswi by R Tejaswi
July 28, 2023
in Reviews
0 0
0
Bro The Avatar Review : పవర్ స్టార్ ‘బ్రో’ రివ్యూ & రేటింగ్..
Spread the love

Bro The Avatar Review : నటీనటులు : పవన్ కళ్యాణ్, సాయి తేజ్, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం తదితరులు..

దర్శకుడు : సముద్రఖని
కథనం, మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: తమన్ ఎస్
నిర్మాతలు : టి.జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల
ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవన్
విడుదల తేది : 28-07-2023

తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతోంది అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన బ్రో సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగులు అందించాడు. హీరోయిన్స్ గా ప్రియ వారియర్ కేతిక శర్మ నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ బ్రో అభిమానులను మెప్పిచ్చిందో లేదో చూద్దాం..

కథ :
మార్కండేయ అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) స్వార్థపరుడు. తన ప్రయోజనాలు తప్ప ఇతరుల గురించి ఆలోచించడు. చివరికి సొంత ఫ్యామిలీని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ప్రతీ ఒక్కటి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు, అలాంటి మార్క్ ఊహించని ప్రమాదంలో కన్ను మూస్తాడు. అతని ఆత్మ ఒక అంధకారం లోకి వెళ్లిన తర్వాత ఒక వెలుగు ద్వారా టైం గాడ్ (పవన్ కళ్యాణ్) వస్తాడు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, కొన్ని రోజులు బ్రతికే ఛాన్స్ ఇవ్వు, అవి తీర్చుకొని వచ్చేస్తాను అంటాడు. టైం గాడ్ అతనికి నెల రోజుల సమయం ఇస్తాడు. ఈ నెలరోజుల్లో అతను తన బాధ్యతలు మొత్తం నెరవేర్చుకున్నాడా లేదా..? అనేదే మిగిలిన స్టోరీ.

రివ్యూ:

ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, మాస్ ఎంట్రీ హైలెట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్లు మాత్రం ప్రేక్ష‌కుల‌ను అలరిస్తాయి. పవన్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ప‌వ‌న్ ఫ్యాన్స్ అయితే ఈ సీన్లు, డైలాగులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఆయన డాన్సులు, టైమింగ్ జోక్స్ ఆకట్టుకుంటాయి. థ‌మ‌న్ ఎన‌ర్జిటిక్ మ్యూజిక్ చాలా బాగుంది.

త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ మీద ఊహించిన‌ట్టుగానే రాసిన పొలిటిక‌ల్ డైలాగులు బాగున్నాయి. ముఖ్యంగా గాజు గ్లాసు మీద డైలాగులు అయితే అదుర్స్‌. ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో చేసి ప‌డేశాడు. అయితే సాయిధ‌ర‌మ్ కూడా మావ‌య్య‌కు పోటీగా న‌టించాడు. పాత్ర స్వ‌భావం దృష్ట్యా సాయి తేజ్ ది కాస్త డామినేటింగ్ రోల్ కూడా.. క‌థ‌, స్క్రీన్ ప్లే యావ‌రేజ్‌గా ఉంద‌ని.. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ పాత్ర‌పై ఎక్కువుగా ఫోక‌స్ పెట్ట‌డంతో క‌థ‌లో అంత బ‌లం లేకుండా పోయింది.

Vivek Agnihotri comments on Prabhas : ప్రభాస్‌ను తాగుబోతంటూ అవమానించిన డైరెక్టర్..

పవన్ కెరీర్‌లో హిట్ అయిన ప్రతి పాట సినిమాలో ఎక్కడో ఒకచోట కవర్ అవుతూ.. సినిమా గ్రాఫ్‌ను అలా ఉంచేందుకు వాడుకున్న‌ట్టుగా ఉంది. అయితే ఇదే సినిమాకు బలంతో పాటు మైనస్ కూడా అయ్యింది. ఎందుకంటే పవన్ ఎలిమెంట్‌లను బ‌ల‌వంతంగా నెట్టడం తప్ప టీమ్ ఫోకస్ కథ లేదా సన్నివేశాల‌పై అంత‌గా క‌స‌ర‌త్తులు చేసిన‌ట్టుగా లేదు.

క్లైమాక్స్ కి అరగంట ముందు నుండి ప్రేక్షకుడి మూడ్ మారిపోతుంది. ఒక్కసారిగా మూవీ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకు కామెడీ, రొమాన్స్ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఎమోషనల్ గా మారిపోతారు. చెప్పాలంటే పతాక సన్నివేశాలు ఏడిపించేస్తాయి. అంత బలమైన ఎమోషనల్ డైలాగ్స్, సీన్స్ తో కూడిన క్లైమాక్స్ ఉంది.

Vignesh Shivan Comments on Baby Movie : బేబి మూవీపై బోల్డ్ కామెంట్స్ చేసిన నయనతార భర్త..

నటీనటుల పెర్ఫార్మన్స్..
పవన్ కల్యాణ్‌ గతంలో గోపాల గోపాల సినిమాలో దేవుడిగా ఎంత బాగా మెప్పించాడో.. ఇందులో కూడా దేవుడిగా బాగానే నటించాడు. నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడేమో అనేంత కూల్ గా నటించి మెప్పించాడు. కొన్ని సాంగ్స్ లో వింటేజ్ పవన్ కల్యాణ్‌ ను చూపించాడు. ఇక సాయితేజ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి ఇరగదీసాడు అనే చెప్పుకోవాలి. మిగతా నటీనటులకు పెద్దగా ప్రాధాన్య లేదు. అయినా సరే వారి పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నికల్‌ పర్ఫార్మెన్స్..
బ్రో సినిమా తమిళ వినోదయ సీతంకు రీమేక్. అయితే వినోదయ సిత్తంలో మెయిన్ హీరో కథ. అందుకే అక్కడ హిట్ అయింది. కానీ తెలుగుకు వచ్చేసరికి దర్శకుడు సముద్రఖని చాలా మార్పులు చేశారు. అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. కొన్ని చోట్ల పాటలను అనవసరంగా చొప్పించారని తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఇమేజ్ కోసం ప్రయత్నించి కథను మార్చేసి దెబ్బ తిన్నారు. థమన్ అందించిన ఒకటి, రెండు పాటలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్..
* పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ నటన
* ఫస్ట్‌ హాఫ్‌ సన్నివేశాలు
* క్లైమాక్స్
మైనస్ పాయింట్స్..
* కథలో సోల్ మిస్ అయింది
* అవనసరంగా జొప్పించిన సీన్లు

రేటింగ్ : 3/5

ట్యాగ్ లైన్ : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ పండుగ లాంటిది.


Spread the love
Tags: Bro Review in TeluguBroReviewBroTheAvatarBroTheAvatarReviewBroTimesStartKetika SharmaPawaanKalyanPawan Bro ReviewPowerstarpawankalyanPriyaPrakashWarriorPspkSaiDharamTejSamuthirakaniTelugu Bro ReviewThamantrivikramబ్రో రివ్యూ
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.