Vivek Agnihotri comments on Prabhas : కశ్మీర్ ఫైల్స్ అనే మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తాజాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఫెయిల్యూర్ పై స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్న ఆయన ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది? అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘ఆదిపురుష్’ మేకర్స్ తో పాటు యాక్టర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పురాణాలు, మతానికి సంబంధించిన కథలపై సరైన నమ్మకం, విశ్వాసం, నమ్మకం లేకుంటే ఇలాంటి అపజయాలే ఎదురవుతాయని ఆరోపించారు. ఈరోజు ఎవరు పడితే వారు తెరమీద కనబడి నేను దేవున్ని అని అనేస్తే సరిపోదు. రాత్రంతా తాగి పొద్దున్నే ఆన్ స్క్రీన్ మీదకు వచ్చి నేను దేవున్ని అంటే నమ్మే రోజులు పోయాయని, జనాలంతా మూర్ఖులు కాదని వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Rajanikanth – Nani : సూపర్ స్టార్ మూవీలో నేచురల్ స్టార్..
ఇంతకు ముందే.. ఆదిపురుష్ అసలు సినిమానే కాదని.. ప్రభాస్‌కు నటుడే కాదంటూ.. కాంట్రో కామెంట్స్ చేసిన ఈయన.. తాజాగా మరో సారి ఆదిపురుష్‌ను .. ఎయిమ్ చేస్తూనే విమర్శలు చేశారు. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలైన ‘ఆదిపురుష్’.. అత్యధిక థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో భారీగా కలెక్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం చతికిలపడింది.