Vignesh Shivan Comments on Baby Movie : ఇటీవల ఓ చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, కల్ట్ క్లాసిక్ గా నిలిచింది బేబీ మూవీ. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ. ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించారు.

బేబీ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అదనపు బలం. నేటితరం యువత మనోభావాలకు అద్ధంపడుతూ స్వచ్ఛమైన ప్రేమకథగా దర్శకుడు సాయిరాజేష్ బేబీ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియెన్స్ నుంచి ప్రశంసలు లభిస్తోన్నాయి. ఈ క్రమంలో కోలివుడ్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న నయనతార భర్త విగ్నేష్ శివన్ తాజాగా ఓ బేబీ సినిమాపై తన అభిప్రాయాన్ని ఇన్ స్టా లో వ్యక్తం చేశాడు.
Vivek Agnihotri comments on Prabhas : ప్రభాస్‌ను తాగుబోతంటూ అవమానించిన డైరెక్టర్..
ఇంత వైల్డ్ గా.. ఇంత క్రూరంగా ఉందేంటి ..బోల్డ్ యాక్టర్స్ కాదు .. బోల్డ్ కంటెంట్ కూడా ఇంత మంచి విజయాన్ని అందుకున్న బేబీ చిత్రానికి అభినందనలు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ లో ప్రశంసిస్తూ ఉన్న ఈయన మెసేజ్ లో మాత్రం ఎక్కడో ఈ ప్రశంసలు కూసింత ట్రాక్ తప్పి కాంట్రవర్షల్ గా మారాయి అంటున్నారు అభిమానులు. సినిమాని ఇలా కూడా పొగుడుతారా అంటూనెటిజన్స్ విగ్నేష్ శివన్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.