Mahesh babu Update : టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి చిత్రాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రేక్షకులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేశారు. అంతేకాదు బాహుబలి చిత్ర కలెక్షన్లతో క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయితే సినిమా సినిమాకి కొంతమేర గ్యాప్ తీసుకునే జక్కన్న ఈసారి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో యాక్షన్ మరియు అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాని తెరకెక్కిస్తున్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని జక్కన్న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
baby movie : బ్లాక్ డే రోజున ప్రేమికుల దినోత్సవ సంబరాలేమిటో..?
మహేష్ కోసం హాలీవుడ్ బ్యూటీ :
అయితే తాజాగా మహేష్ మరియు రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా ప్రముఖ ఇండోనేషియా నటి చీల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ ని ఖరారు చేసినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా గతంలో జక్కన్న తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ కి చెందిన ప్రముఖ హీరోయిన్ ఓలివియా మోరీస్ ని నటింపవజేశాడు.

ఆర్.ఆర్.ఆర్ ఫార్ములా అప్లయ్ చేస్తున్నాడా.?
దీంతో లండన్ లో కూడా లండన్ లో కూడా ఆర్.ఆర్.ఆర్ కి మంచి బిజినెస్ జరిగింది. దీంతో ఇదే ఫార్ములా ని మహేష్ చిత్రానికి కూడా అప్లై చేసినట్టు తెలుస్తుంది. అందుకే పక్క దేశం నుంచి జక్కన్న మహేష్ కి జోడీగా దింపినట్లు తెలుస్తోంది. ఇక నటి చీల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ విషయానికొస్తే ఈ అమ్మడు అమెరికా దేశానికి చెందిన నటి అయినప్పటికీ ఇండోనేషియా దేశంలో పలు హిట్ చిత్రాల్లో నటించింది.
Valentine’s Day Special Movies : 10 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రీ రిలీజ్.. ఏవంటే?
ఈ విషయం ఇలా ఉండగా మహేష్ బాబు ఇటీవలే గుంటూరు కారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించ లేకపోయింది. కానీ మహేష్ బాబు మాత్రం తన సోలో పెర్ఫెర్మాన్స్ తో ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేశారు. దీంతో రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బాగానే శ్రమిస్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు.