Valentine’s Day Special Movies : 10 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రీ రిలీజ్.. ఏవంటే?
ప్రేమికుల రోజు రానే వచ్చేసింది. ఈ పండుగను జరుపుకోవడానికి చాలా మంది లవర్స్ ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. షాపింగ్, పార్టీలు, గిఫ్టులు.. ఇలా చాలనే ఊహించుకుంటారు. వీటితో పాటు అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలను కూడా చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్కే వేరు. అది అర్థం చేసుకున్న చాలా మంది అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తూ.. లవర్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు.
10 అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలు రేపు థియేటర్లలో..
ముఖ్యంగా ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా.. చాలానే సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో ఈసారి ఏకంగా 10 అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలు రేపు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఈ సినిమాలు ఏంటి.. అందులో కచ్చితంగా చూడాల్సినవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐదు తెలుగు సినిమలు కాగా.. ఒకటి హాలీవుడ్, మరో మూడు హిందీ చిత్రాలు.
ఫిబ్రవరి 14వ తేదీన ఏకంగా 10 సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో మొదటిది ఓయ్, రెండోడి సీతా రామం, మూడోది సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, నాలుగోది పవన్ కల్యాణ్ తొలిప్రేమ, ఐదోది బేబీ, ఆరోది టైటానిక్, ఏడోది దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, ఎనిమిదోది జబ్ వీ మెట్, తొమ్మిదోది వీర్ జారా, పదోది మొహబ్బతీన్. అయితే ఇందులో ఐదు తెలుగు సినిమలు కాగా.. ఒకటి హాలీవుడ్, మరో మూడు హిందీ చిత్రాలు.
యూఎస్ లో సెటిల్ అయిన మాజీ తెలుగు హీరోయిన్
ఈ 10 సినిమాలు చూడాల్సినవే అయినా.. సీతా రామం, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఓయ్, టైటానిక్, జబ్ వీ మెట్ చిత్రాలను మాత్రం కచ్చితంగా చూడండి. మీ మనసుకు తాకే ఈ చిత్రాలను మీరు మెచ్చే, మిమ్మల్ని ప్రియుడు లేదా ప్రియురాలితో కలిసి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. మీరు కూడా అలాంటి ప్రేమికులుగా ఉండేందుకు.. అంటే అంత గొప్పగా ప్రేమించుకునేందుకు ఏమేం చేయాలో కూడా తెలుసుకుంటూ హాయిగా ముందుకు సాగండి.
Discussion about this post