Dhanathrayodashi : లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ధన త్రయోదశి. ఈరోజును నవంబర్ 10వ తేదీన అందరూ జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన శని స్వరాశి అంటే కుంభరాశిలో ఉంటాడు. బృహస్పతి మేషరాశిలోనూ, శుక్రుడు కన్యారాశిలోనూ, సూర్యుడు తులా రాశిలోనూ ఉంటారు. ఈ మూడు గ్రహాల కలయిక దాదాపు 59 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరల జరుగుతుంది.
వీటితోపాటు శుక్రుడు కన్యారాశిలో ఉండడమే కాక, చంద్రుడు కూడా కన్యారాశిలోనే ఉంటాడు. ధన త్రయోదశి నాడు కన్యారాశిలో శుక్రుడు, చంద్రుడు కలయిక వల్ల శుక్ర శశి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ అరుదైన కలయిక వల్ల ఐదు రాశుల వారు ఎంతో ప్రయోజనం పొందుతారు అని వాళ్ళు వెల్లడించారు.
ధనుస్సు రాశి
దీపావళి రోజు తర్వాత ధనుస్సు రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయి వ్యాపారులకు మంచి లాభదాయకంగా అలాగే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా కొత్త ఆదాయ వరుణులు సమకూరి ఉద్యోగులకు బోనస్ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు విద్యార్థులు కూడా విదేశీ ప్రయాణం అవకాశం ఉంటుందని వారు తెలిపారు
వృశ్చికరాశి
వ్యాపారం చేసే వారికి ఈ ధన త్రయోదశి మంచి ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఇల్లు ఆనందంతో, సకల సౌభాగ్యాలతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమని చెబుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి వీరు భయటపడతారని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.
సింహ రాశి
ధన త్రయోదశి సింహ రాశి వారికి అదృష్టకాలంగా చెప్పవచ్చు. ఇంట్లో వీరికి సంతోషకరమైన వాతావరణంతో పాటు, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. వారసత్వ సంపద, ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరే అవకాశాలు ఉన్నాయి. వీరు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తార
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ రోజున శుభయోగంగా చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అంట, అలాగే వర్తక వ్యాపారంలో ఉన్నవారైతే మంచి లాభాలను ఆర్జిస్తారు.
మేషరాశి
మేషరాశి వారికి ఈ గ్రహాల కలయిక మంచి ఫలితాన్ని తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. గృహ సౌఖ్యాన్ని వీరు పొందుతారు. శాంతి సౌభాగ్య వాతావరణం వీరి జీవితంలో నెలకొంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు దాంపత్య జీవితం మెరుగ్గా ఉండి, గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించడమే గాక వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపుని తెచ్చుకొని ప్రశంసలు పొందుతారు.