చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు. వాటి మధ్య ఎప్పుడు పొగలు కక్కుతూ ఓ అగ్నిపర్వతం. Mount Bromo అని దీని పేరు. బ్రహ్మదేవుని పేరుమీద దీనికి ఆ పేరు పెట్టారని చెబుతారు. ఇంతకీ ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇండోనేషియా లో ఉంది ఈ అగ్నిపర్వతం. అక్కడ చాలా అగ్నిపర్వతాలు ఉన్నా ఇది మాత్రం ఎప్పుడూ పొగలు కక్కుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్రదేశం. సరిగ్గా దాని ముందు కొలువై ఉన్నాడు ఈ విఘ్నేశ్వరుడు.
చుట్టుపక్కల ఈ విఘ్నేశ్వరుని విగ్రహం, క్రింద శివాలయం తప్ప ఇంక ఏమీ కనబడవు. 15వ శతాబ్దం ముందు ఇండోనేషియాలో హిందువులు ఎక్కువగా ఉండేవారు. ఆ టైంలోనే వీటిని ఇక్కడ ప్రతిష్టించారనీ, అప్పటినుండి ఎన్నోసార్లు అగ్నిపర్వతం బద్దలైనా దాని ధాటికి ఇవి ఏమాత్రం చెక్కుచెదరకుండా ఇలాగే ఉన్నాయని చెప్తారు. ఈ అగ్ని పర్వత ఆవేశం నుండి తమను ఆ గణేశుడే కాపాడతాడని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 2016లో బద్దలు అయింది. ఈ విఘ్నేశ్వరుని దర్శనం కావాలంటే ఇండోనేషియా వెళ్లాల్సిందే..