• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Lord Venkateswara : తిరుపతి వేంకటేశ్వరుడిని కాలి నడకన చేరుకొనే మార్గాలు ఎన్నో.. అవేమిటంటే..

Rama by Rama
October 9, 2023
in Latest News, Life Style, ఆధ్యాత్మికం
0 0
0
Lord Venkateswara : తిరుపతి వేంకటేశ్వరుడిని కాలి నడకన చేరుకొనే మార్గాలు ఎన్నో.. అవేమిటంటే..
Spread the love

Lord Venkateswara : కలియుగ దైవంగా పేరుగాంచిన ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికలను తీరుస్తూ, ఇప్పటికీ నిత్య పూజలు అందుకుంటూ.. శోభాయమానంగా వెలిగిపోతున్నాడు. అయితే కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక రకాలుగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ దేవాలయానికి లేనటువంటి ఒక పద్ధతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉంది.  అదేమిటంటే.. ఆ ఏడుకొండలను అధిరోహించి ఆ స్వామిని దర్శించుకోవడమే.. 

మరీ ఇంకెందుకు ఆలస్యం.. ఆ మార్గలేంటో తెలుసుకుందాం…

అన్నమాచార్యుడు : తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఏడుకొండలు ఎక్కాల్సిందే అని మనకు తెలిసిన విషయమే. ఆ ఏడుకొండలను అధిరోహిస్తే ఆ స్వామి దర్శనం మనకు కలుగుతుంది. అయితే వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు అయినటువంటి అన్నమాచార్య నడకమార్గాన్ని కనిపెట్టిన మొదటి వ్యక్తి. ఆ వెంకటేశ్వరున్నీ దర్శించుకోవడానికి అన్నమాచార్యుడు మొదటగా అలిపిరి మార్గం గుండా ఆ స్వామిని వెతుకుతూ ఏడుకొండలు అధిరోహించాడు. చాలావరకు భక్తులకు ఈ మార్గమే తదుపరి కాలాంతరంలో ప్రధాన మార్గంగా మారిపోయింది. 

కానీ ఆ స్వామిని దర్శించుకోవడానికి ఇంకా దారులు ఉన్నాయి. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాలినడకన దైవదర్శనమే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసించి, ఇరుకైన మార్గాలగుండనే తమ భక్తిని చాటుతూ ముందుకు వెళుతుంటారు.

మొదటి దారి : శ్రీవారి దర్శనానికి మొదటి మార్గంగా అలిపిరిని మనం చెప్పుకోవచ్చు. ఈ దారి గుండనే మనం స్వామిని సులభంగా చేరుకోవచ్చు.

రెండవ దారి : ఆ స్వామి దర్శనానికి రెండో మార్గంగా తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురాన్ని చెప్పుకోవచ్చు. అక్కడి నుండి శ్రీవారి మెట్టు 5 కిలోమీటర్లు, మరల ఆ మార్గం గుండా 3 కిలోమీటర్లు వెళితే స్వామి దర్శనం అవుతుంది. చంద్రగిరి కోట నిర్మాణ అనంతరం ఈ దారి వెలుగులోకి వచ్చింది.

మూడవ దారి : ఈ మూడో మార్గం విజయనగర రాజుల కాలంనాటి నుండే ఉంది. ఆ మార్గంగా వెళ్లే భక్తుల కోసం ఆనాటి రాజప్రస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసి, రాతిమెట్లను నిర్మించారు. అతి ముఖ్యమైన దారిగా దీనిని చెప్పుకోవచ్చు. పూర్వీకుల నుంచి ఒక ప్రాశస్త్యాన్ని ఈ దారి చాటుకుంది. ఆ మార్గమే ఈశాన్య దిక్కున ఉన్న మామండూరు.

నాలుగవ దారి : తిరుమలకు పశ్చిమం దిక్కున ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్ గుండా శ్యామలకోన ప్రాంతం నుంచి వెళితే ఆ స్వామి దర్శనం అవుతుంది.

ఐదవ దారి : కళ్యాణి డ్యామ్ గుండా 5 కిలోమీటర్లు ముందుకు వెళ్లిన తర్వాత అక్కడ ఒక మలుపు కనిపిస్తుంది. అక్కడినుండి తూర్పు వైపు తిరిగి కొంత దూరం వెళ్లిన తర్వాత నారాయణగిరి కొండలు వస్తాయి, ఆ స్వామి దర్శనం అవుతుంది.

ఆరవ మార్గం : కడప సరిహద్దుల్లో చిత్తూరు ప్రారంభంలోనే మనకు కుక్కల దొడ్డి అనే ఒక గ్రామం కనిపిస్తుంది.  ఆ స్థలం దగ్గర నుంచి తుంబురతీర్థం, పాపవినాశనం మీదుగా వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవచ్చు.

ఏడవ మార్గం : ఇక ఏడవ మార్గంగా ఆవ్వాచారికోన మార్గాన్ని చెబుతుంటారు. రేణిగుంటకు దగ్గర్లో ఆంజనేయపురం అనే గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే స్వామిని దర్శించుకోవచ్చు.

ఎనిమిదో మార్గం : ఎనిమిదో మార్గంగా ఏనుగుల దారిని చెప్తుంటారు. ఇది కూడా చాలా ప్రశస్తం పొందిన మార్గమే.  ఎందుకంటే.. అప్పుడు ఆలయ నిర్మాణానికి ఈ మార్గం గుండానే ఏనుగుల ద్వారా మండపాలకు కావలసిన రాతి స్తంభాలను తీసుకువచ్చారు. ఈ మార్గం కూడా స్వామి దర్శనానికి అనుగుణమే.

తలకోన : తలకోన జలపాతం గుండా జండాపేట్ దగ్గర నుంచి వెళితే ఇంచుమించు ఆలయం దగ్గరలోకి సమీపించినట్టే, ఇది కూడా మంచి మార్గం అని చెప్పవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ కలియుగ దైవాన్ని మీరు దర్శించి, దైవ ఆశీస్సులను పొందండి.

 


Spread the love
Tags: 700 Years Old Lord Ganesha StatueLatest News on Lord KrishnaLord Hanuman Idol at HomeLord VenkateswaraPurattasi Saturdays Lord Venkateswara RitualsRoutes to Lord Venkateswara Swamy Temple
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.