Mount Bromo Ganesha : అగ్ని పర్వతం నుండి ప్రజలను కాపాడే గణేషుడు.. ఎక్కడో తెలుసా..?
చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు. వాటి మధ్య నిత్యం పొగలు కక్కుతూ ఓ అగ్నిపర్వతం. Mount Bromo అని దీని పేరు. బ్రోమో అంటే జపనీస్ భాష లో బ్రహ్మ అని అర్ధం.బ్రహ్మదేవుని పేరుమీద దీనికి ఆ పేరు పెట్టారని చెబుతారు. ఇంతకీ ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? ఇండోనేషియా లోని తూర్పు జావా ప్రావిన్స్‌లో ఉంది ఈ అగ్నిపర్వతం. ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రాంతాలలో ఇది ఒకటి. ఇంకా అక్కడ చాలా అగ్నిపర్వతాలు ఉన్నా ఇది మాత్రం ఎప్పుడూ పొగలు కక్కుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్రదేశం. సరిగ్గా దాని ముందు కొలువై ఉన్నాడు ఈ విఘ్నేశ్వరుడు. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం వద్ద ఉన్న ఈ గణేశుని విగ్రహం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.
చుట్టుపక్కల ఈ విఘ్నేశ్వరుని విగ్రహం, క్రింద శివాలయం తప్ప ఇంక ఏమీ కనబడవు. 15వ శతాబ్దం ముందు ఇండోనేషియాలో హిందువులు ఎక్కువగా ఉండేవారు. ఆ టైంలోనే వీటిని ఇక్కడ ప్రతిష్టించారనీ, అప్పటినుండి ఎన్నోసార్లు అగ్నిపర్వతం బద్దలైనా దాని ధాటికి ఇవి ఏమాత్రం చెక్కుచెదరకుండా ఇలాగే ఉన్నాయని చెప్తారు. ఈ అగ్ని పర్వత ఆవేశం నుండి తమను ఆ గణేశుడే కాపాడతాడని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 2016లో బద్దలు అయింది. ఈ విఘ్నేశ్వరుని దర్శనం కావాలంటే ఇండోనేషియా వెళ్లాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Discussion about this post