Squirrel Hanuman : ఆంజనేయస్వామి చాలా శక్తివంతమైన దేవుడు. భక్తుల కోరికలను తీరుస్తూ, నిత్య పూజలు అందుకునేవాడు. భారత దేశంలో ఆంజనేయస్వామి కీర్తి గొప్పది. ఇప్పటికి కూడా ఎక్కువమంది భక్తులు ఆ స్వామిని కొలిచి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. భక్తులు ఆంజనేయస్వామి మాలలు ధరిస్తారు. ఒంటినిండా చందనం పూసుకున్న ఎన్నో ఆంజనేయస్వామి విగ్రహాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి.
అయితే ఉడుత రూపంలో ఉన్న హనుమంతుడిని మీరు ఎప్పుడైనా చూశారా? అవును మీరు విన్నది నిజమే..అలీఘర్‌లోని అచల్ సరోవర్ ఒడ్డున ప్రసిద్ధ హనుమాన్ దేవాలయంలో హనుమంతుడు ఉడత రూపంలో ఉన్నాడు. మొదటిసారిగా ఇక్కడ ఉడుత రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం ఉందని, గిల్హారాజ్ శ్రీ మహేంద్రనాథ్ యోగిజీ మహారాజ్ కనిపెట్టారు.
ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడుకి పూజలు చేస్తారు. దీనిని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తుంది. మహేంద్ర నాద్ యోగి కూడా అదే చెప్తారు. ఆయన కలలో ఉడత రూపంలో ఆంజనేయస్వామి దర్శనమిచ్చి, తనకు గుడికట్టి, పూజించమని చెప్పినట్టు చరిత్ర చెబుతుంది.
అంత చరిత్ర కలిగిన ఈ ఉడత రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇప్పుడు చాలా ప్రత్యేకమైనది. ఎంతోమంది భక్తులు, పర్యటకులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉన్నారు.