Vinayaka Chavati : వాడ ,వాడల సందడి చేయడానికి వినాయకుడు వచ్చేశాడు. వినాయక చవితి పర్వదినాన ఆ వినాయకుని తొమ్మిది రోజులు కొలుచుకోవడానికి మండపాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇండ్లలో పెట్టుకొని ఆపద్బాంధవుడు అంటూ ఆ గణపయ్యను కొలుచుకునే ప్రతిష్టాత్మకమైన రోజు ఈ రోజు.
ప్రతి సంవత్సరం “భాద్రపద శుద్ధ చవితి” రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఆరోజు ఆ గణపయ్య పుట్టినరోజు. శివపార్వతుల ముద్దుల తనయుడైన అభినాయకుడు సర్వవిజ్ఞాలను తొలగించడంలో సిద్ధహస్తుడు. భక్తులు భక్తి,శ్రద్ధలతో తొమ్మిది రోజులు నియమ,నిష్ఠలతో ఆ వినాయకుడిని కొలుచుకుంటే వారి జీవితాల్లో ఉన్న సర్వ అరిష్టాలు దూరమవుతాయి.
గణపయ్యకు ప్రీతికరమైన కుడుములు ఉండ్రాళ్ళు పులిహోర, లడ్డూలు ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించి తొమ్మిది రోజులు ఆ విజ్ఞేషుడిని కొలుచుకోవాలి. విజ్ఞానాలను తొలగించే విగ్నేశ్వరుడు నీ ప్రతిష్టించే రోజు చవితి రోజు. ఆరోజు చందమామను చూస్తే అరిష్టమని చెబుతుంటారు. ఒకవేళ అనుకొని పరిస్థితులలో చందమామను చూస్తే ఆ అరిష్టం నుంచి బయట పడాలంటే ఈ శ్లోకాన్ని 11 సార్లు స్మరించాలి. దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో విజయాలను చూస్తారు.
సింహ: ప్రసేన మవధీత్ సింహొజాంబవతా హత:
సుకుమారక మారోదీ: తవ హ్యోషస్స:మంతక:
యేషా బాలక మరోదీ:
తవ హియేషా శమతక