ART Cinemas : మహేష్ బాబు AMB, బన్నీ AAA కి పోటీగా మరొకటి దిగుతోంది.. భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న స్టార్ హీరో
స్టార్ హీరోలు ప్రస్తుతం కేవలం సినిమాలకి మాత్రమే పరిమితం కావడం లేదు. కాసులు కురిపించే బిజినెస్ లు ప్రారంభించేస్తున్నారు. హీరోలు సినిమా రంగంలో ఉంటారు కాబట్టి.. సినిమా అనుబంధ వ్యాపారాలు చేస్తుంటారు. కొందరు సినిమా నిర్మాణాలు చేపట్టడం.. మరికొందరు థియేటర్ బిజినెస్ చేయడం చూస్తూనే ఉన్నాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్రెడీ తాం పేరుపై మల్టీ ప్లెక్స్ లని నిర్మించేశారు. మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్, అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ ప్రస్తుతం కాసులు కురిపిస్తున్నాయి. స్టార్ హీరోలు నిర్మించిన మల్టిఫ్లెక్స్ లపై అభిమానులకు ఉండే క్రేజే వేరు. కొన్నేళ్ల క్రితం మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏఎంబి సినిమాస్ ని ప్రారంభించారు.
ART Cinemas : Raviteja’s Multiplex Theatre
గత ఏడాది అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ ని ప్రారంభించారు. క్రమంగా మల్టీప్లెక్స్ కల్చర్ పెరుగుతోంది. సింగిల్ స్క్రీన్స్ తగ్గుతున్నాయి. దీనితో మల్టీ ప్లెక్స్ లకు ఉన్న క్రేజ్ ని హీరోలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ బాటలో మరో స్టార్ హీరో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
Mirnalini Ravi Hot Pics : మత్తెక్కిస్తున్న మృణాళిని రవి..
మాస్ మహారాజ్ రవితేజ కూడా భారీ మల్టీ ప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతోనే రవితేజ కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. 6 స్క్రీన్లతో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మాణం జరుగుతోందట. మరో రెండు నెలల్లో ఇది పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ షుక్ నగర్ ప్రాంతంలో ఈ మల్టీ ప్లెక్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ART అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సో మాస్ మహారాజ్ పేరుపై భాగ్యనగరంలో అత్యాధునిక హంగులతో మల్టీ ప్లెక్స్ ఏర్పాటు కాబోతోంది.