baby movie : ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పాత చిత్రాల రీ-రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. కాగా ఇప్పటివరకు టాలీవుడ్ ప్రముఖ హీరోలైన మహేష్ బాబు(పోకిరి), పవన్ కళ్యాణ్ (ఖుషీ, కెమెరామెన్ గంగతో రాంబాబు, తొలిప్రేమ), మహేష్ బాబు (బిజినెస్ మాన్), ఎన్టీఆర్ (సింహాద్రి), రామ్ చరణ్ (ఆరెంజ్), అల్లు అర్జున్ ( దేశముదురు), ప్రభాస్ (బిల్లా) తదితరుల చిత్రాలని రీ – రిలీజ్ చేయగా కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. అలాగే కరోనా సమయంలో షూటింగులు ఆగిపోవడంతో మొదట్లో సినిమాల విడుదల విషయంలో కొంతమేర సందిగ్ధత ఉండేది. దీంతో ప్రముఖ హీరోల చిత్రాల రీ రిలీజ్లు బాగా ఉపయోగ పడ్డాయి.
Yatra 2: ‘యాత్ర 2’ అనుకున్నంత ప్రభావం చూపిందా.. వైసీపీకి ఒరిగిందేంటి ?
Animal Movie Heroine Tripti Dimri : తృప్తి డిమ్రి లేటెస్ట్ పిక్స్
బేబీ చిత్రం (baby movie) తెలుగులో మళ్ళీ రీ రిలీజ్:
ఇక అసలు విషయంలోకి వెళితే తెలుగులో గత ఏడాది మంచి హిట్ అయిన బేబీ చిత్రాన్ని తెలుగులో మళ్ళీ రీ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 14వ తారీఖున దినోత్సవం సందర్భంగా థియేటర్లలో మళ్ళీ బేబీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. కాగా మంచి లవ్ మరియు ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. కేవలం రూ.10 కోట్లబడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 80 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, సూర్య యొక్క సూర్య స/ఓ కృష్ణన్, హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ టైటానిక్, సిద్ధార్థ్ ఓయ్! అలాగే సీతారామం వంటి చిత్రాలు కూడా రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.
ఫిబ్రవరి 14 బ్లాక్ డే :
అయితే పాశ్చాత్య దేశ సంస్కృతి అయిన వాలైంటెన్స్ డే సెలెబ్రేషన్స్ ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అలాగే 2016వ సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తారీఖున కొందరు పాకిస్తాన్ ముష్కరులు అక్రమంగా దేశంలోకి చొరబడి హ్యూమన్ బాంబ్ తో సైనికులపై దాడి చేసి దారుణంగా హతమార్చారు. దీంతో ప్రపంచ దేశాలు ఫిబ్రవరి 14న వాలైంటెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మనకి మాత్రం ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా ఉంది. కాబట్టి ఫిబ్రవరి 14వ తారీఖున ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవద్దని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Janasena : ఇక్కడ జనసేన విజయం లాంఛనమే..