Barrelakka Marriage : పెళ్లి పీటలెక్కబోతున్న బర్రెలక్క.. ఎంగేజ్మెంట్ దృశ్యాలు వైరల్
బర్రెలు కాస్తూ యూట్యూబ్ లో వీడియో షేర్ చేయడంతో బర్రెలక్కగా ఫేమస్ అయింది. ఆమె అసలు పేరు శిరీష. 2022 నుంచి యూట్యూబ్ లో వీడియోలతో పాపులారిటీ సొంతం చేసుకుంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో బర్రెలక్క మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి అంతా చర్చించుకున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క 5వేల పైచిలుకు ఓట్లు సాధించి నాల్గవ స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో ఇంత అభిమానం సొంతం చేసుకున్న బర్రెలక్క అలియాజ్ శిరీష సడెన్ గా గుడ్ న్యూస్ ప్రకటించింది.
బర్రెలక్క వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. ఆ దృశ్యాలని బర్రెలక్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తన కి కాబోయే భర్త గురించి ఎలాంటి విషయాలు బయట పెట్టలేదు.
గతంలో బర్రెలక్క పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలని బర్రెలక్క ఖండించింది. బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ తో ముడిపెడుతూ కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ తనకి అన్నయ్య లాంటివాడు అని బర్రెలక్క క్లారిటీ ఇచ్చింది.
View this post on Instagram
బర్రెలక్క తన పెళ్ళికి షాపింగ్ చేస్తున్న దృశ్యాలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో పెద్ద హంగామామే జరిగింది. బర్రెలక్క ప్రభావంతో తామెక్కడ ఓడిపోతామో అని బడా కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి నేతలు తెగ కంగారు పడ్డారు. నేరుగా ఆమె తమని ఓడించకపోయినా.. ఓట్లు చీల్చి తద్వారా ఓటమికి కారణం అవుతుందని కంగారు పడ్డారు. కానీ గెలిచిన అభ్యర్థికి, ఓడిన అభ్యర్థికి మెజారిటీ వ్యత్యాసం 30 వేల వరకు ఉంది. ఆ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.