తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే తరచూ కొన్ని లక్షలమంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మగవాళ్ళకి బస్సులో కనీసం సీట్లు కూడా లేకుండా నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సీట్లు లేక ఇక్కట్లు :
దీంతో 2 లేదా 3 గంటలు ప్రయాణం చేసే సమయంలో మగవాళ్ళు సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నప్పటికీ నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని కాబట్టి ఈ సమస్య కి పరిష్కారం చూపాలని ఇప్పటికే చాలామంది పురుషులు సోషల్ మీడియాలలో లాగే మీడియా ద్వారా తమ గోడుని ప్రభుత్వానికి విన్నవించారు. ఇక కొన్ని చోట్ల ఓవర్ లోడ్ కారణంగా డ్రైవర్లు బస్సులు ఆపకపోవడంతో కండెక్టర్లు డ్రైవర్లపై దాడులు కూడా చేసిన ఘటనలు లేకపోలేదు.

Free Bus for Men :
అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మహిళలతోపాటూ పురుషులకి కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాగా ఇటీవలే HMDA డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులను మాయల్లీ పునః ప్రారంభించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ముందుగా కొన్ని రోజులకపాటూ ట్రయల్ రన్ నిర్వహించి సమస్యలు విశ్లేషించి అధిగమించిన తర్వాత పూర్తీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Chandrababu Met Amit Shah : టిడిపికి, బిజెపితో పొత్తు లాభమా.. నష్టమా..?
Hero Mahesh : సినిమా ఆఫర్లు లేక మద్యం అలవాటుకి బానిసయిన హీరో మహేష్.. చివరికి ఏమైందంటే..?
MLA Roja : డైమండ్ రాణి అంటూ నటి రోజా పై కమెడియన్ సంచలనం.
డబుల్ డెక్కర్ బస్సులతో ట్రయల్ రన్ :
ఇందులో భాగంగా 6 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు కొని ఉచితంగా ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఈ డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించాలనుకున్నవారు ఎలాంటి రుసము లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఉచిత బస్సు సర్వీసులు ప్రస్తుతం ట్యాంక్‌బండ్, గచ్చిబౌలి, విప్రో జంక్షన్, బయోడైవర్సిటీ, చార్మినార్, హైటెక్ సిటీ, తదితర ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి మీరు ఆ రూట్ లో ప్రయాణించేతప్పుడు సరదాగా డబుల్ డెక్కర్ బస్సు ఎక్కి ప్రయాణాన్ని ఆస్వాదించండి.
