Kiran Rathod : డైరెక్టర్ల కోసం అలాంటి వీడియోలు చేశా.. షకీలా ముందు అశ్లీల చిత్రాలపై నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ భామ
బోల్డ్ నటిగా కిరణ్ రాథోడ్ టాలీవుడ్ లో గుర్తింపు పొందింది. పదేళ్ల క్రితం వరకు కిరణ్ రాథోడ్ సినిమాల్లో యాక్టివ్ గానే ఉండేది కానీ ఇటీవల కిరణ్ రాథోడ్ కి సరైన అవకాశాలు రావడం లేదు. బోల్డ్ పాత్రలకు సిద్ధం అంటూ సంకేతాలు పంపుతున్నప్పటికీ ఆమెని దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు.

అలాంటి తరుణంలో కిరణ్ రాథోడ్ కి బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొనే అవకాశం వచ్చింది. అయినా దాని వల్ల ఏం ఉపయోగం.. తొలి వారం లోనే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. కొన్ని వారాలైనా ఉండి ఉంటే ఆమెకి కావలసిన గుర్తింపు, మైలేజి దక్కేవి. తద్వారా సినిమా ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉండేది.

తాజాగా కిరణ్ రాథోడ్.. శృంగార నటి షకీలా హోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో కిరణ్ రాథోడ్ అన్ని విషయాలని బయట పెట్టింది. ఇండస్ట్రీలో కమిట్ మెంట్ పేరుతో ఎలా వేధిస్తారో కూడా వివరించింది. మీడియా వల్లే తనపై అశ్లీల నటి అనే ముద్ర పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

కిరణ్ రాథోడ్ మాట్లాడుతూ.. తనకి ఇటీవల అవకాశాలు రాకపోవడంతో ఒక యాప్ ఓపెన్ చేశాను. అందులో హాట్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ వచ్చాను. ఎవరైనా దర్శకులు, నిర్మాతలు వాటిని చూస్తే సినిమాల్లో ఛాన్స్ ఇస్తారనే ఉద్దేశంతో అలా చేశాను. కానీ నాపై అశ్లీల చిత్రాల్లో నటించే నటి అంటూ ముద్ర వేసారు. కొంతమంది ఫోన్ చేసి సినిమాలో ఛాన్స్ ఉంది.. కానీ అంతకంటే ముందు నైట్ కి కమిట్ మెంట్ ఇవ్వాలి అని అడుగుతారు.

Kiran Rathod about her hot videos and photos
అలాంటి కాల్స్ విపరీతంగా వచ్చేవి. దీనితో ఆ యాప్ ని క్లోజ్ చేశాను. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. నాకంటే హాట్ గా, అసభ్యంగా పోస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నన్నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు నచ్చిన బట్టలు వేసుకుని వీడియోలు పెడుతున్నా అంతే. నా లాగా చాలా అంన్డి చేస్తున్నారు కదా అని కిరణ్ రాథోడ్ పేర్కొంది.

ఎవరైనా ఫోన్ చేసి సినిమా ఛాన్స్ ఇస్తారనుకుంటే.. డబ్బులిస్తాం రాత్రికి వస్తావా అని పిలుస్తారు. కమిట్ మెంట్ ఇవ్వడానికి ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చావు కదా అని నా వీడియోలకు కామెంట్స్ పెడుతున్నారు. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉన్నట్లు కిరణ్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేసింది.

Kiran Rathod on Casting Couch in Tollywood
గతంలో నాలుగేళ్ళ పాటు ఒక నీచుడిని ప్రేమించా. అతడిని పెళ్లి చేసుకుని ఉంటే నన్ను చంపేసేవాడు. వాడి కోసం నాకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వదులుకున్నా. అలా చేయకుంటే ఇప్పుడు నా కెరీర్ బావుండేది అని కిరణ్ రాథోడ్ తెలిపింది. కిరణ్ రాథోడ్.. నువ్వు లేక నేను లేను, జెమిని , భాగ్య లక్ష్మి బంపర్ డ్రా లాంటి చిత్రాల్లో నటించింది.
Jabardasth Satya: ఛీ ఛీ.. జబర్దస్త్ నటిపై ఇలాంటి బూతులా.. బరితెగించిన కమెడియన్

