Netflix Password Sharing : ఇండియాలో OTT ప్లాట్‌ఫాంలకు ఇటీవల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. గతంలో సినిమా అంటే థియేటర్లకే వెళ్లాలనే ప్రేక్షకులు క్రమంగా ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. ఓటీటీలో ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్నాయి. అయితే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్ నిలిపివేసినట్లు ప్రకటించింది. ఎవరైతే నెట్క్లిఫ్లెక్స్ చందా తీసుకుంటారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై యాక్సెస్ పొందగలరని స్పష్టం చేసింది.

ఒక కుటుంబంలో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కలిగి ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణ సమయంలో, సెలవుల్లో ఎక్కడున్నా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రొఫైల్ బదిలీ, అకౌంట్ యాక్సెస్ వంటి అదనపు సదుపాయాలను కూడా పొందవచ్చని వెల్లడించింది. గత మే నెలలో నెట్‌ఫ్లిక్స్ యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలోనే పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది నెట్‌ఫ్లిక్స్.
Vaishnavi Chaitanya : బేబీ లో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి వైష్ణవిని ఎలా ఒప్పించారో తెలుసా..!?
అయితే, ఈ నిర్ణయం వలన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 మిలియన్ల మంది కొత్త యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు వచ్చారు. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం.. తాజా త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్స్ర్కైబర్లతో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే 2017లో స్వయంగా నెట్‌ఫ్లిక్స్ కంపెనీనే పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవాలని ప్రచారం చేయడం గమనార్హం. లవ్ ఈజ్ షేరింగ్ పాస్వర్డ్ అని ప్రచారం కూడా నిర్వహించింది. నెట్వర్క్ విస్తరించుకోవడం కోసం తొలుత నెట్‌ఫ్లిక్స్ ఈ వ్యూహం అనుసరించింది.
BRO Censor Talk : పవన్ ‘బ్రో’ సెన్సార్ టాక్.. మూవీ ఎలా ఉందంటే..