Sleeping Tips : నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం అయితే నిద్రపోయే పొజిషన్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా పడితే అలా పడుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం..
★ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది : చాలామంది భోజనం చేయగానే వెంటనే పడుకుంటారు. అలా చేయకూడదు. అలాగే కుడివైపు తిరిగి అసలు పడుకోకూడదు. ఎడమవైపున పడుకుంటే తినే ఆహారం మన జీర్ణవ్యవస్థ ప్రక్రియను సులభం చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
★ గుండె ఆరోగ్యానికి : మన శరీరంలో గుండె ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుండె పనితీరు సరిగా ఉండాలంటే, రక్తపోటు అదుపులో ఉండాలంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం ఉత్తమం. దానివల్ల రక్తం సరిగా రవాణా అవుతుంది.
★గురక : గురక చాలా తీవ్రమైన సమస్య దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలా గురక సమస్య ఉన్నవారు ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. గాఢంగా నిద్ర పోగలుగుతారు.
★నొప్పి నివారణ : వెన్నునొప్పి, మెడ నొప్పి అని విపరీతంగా బాధిస్తూ ఉంటాయి. ఇలా ఉన్నవారు క్రమంగా వారం ఎడమవైపు తిరిగి పడుకుంటే నొప్పి తగ్గుముఖం పడుతుంది.
★గర్భిణీ స్త్రీలకు మంచిది : గర్భిణీ స్త్రీలు ఎడమవైపు పడుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. దీనివల్ల పిండం భాగం, గర్భాశయం నుంచి రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. గర్భస్రావమయ్యే అవకాశాలు ఉండవు.
★గ్యాస్ట్రిక్ సమస్యకు విముక్తి : తిన్న తర్వాత కుడివైపుకు తిరిగి పడుకుంటే గ్యాస్టిక్ సమస్య వస్తుంది. కాబట్టి ఎడమవైపు పడుకోవడం వల్ల కడుపులో ఆమ్లం చాతికి తిరిగి రాకుండా చేస్తుంది.