Student Killed : సెలవు కోసం ఏకంగా తోటి విద్యార్థిని చెరువులోకి తోసి హత్య చేసిన ఘనుడు.. </h4 >
ఈ మధ్యకాలంలో కొందరు చేసే తప్పుల కారణంగా ఇతరులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటీవలే ఓ విద్యార్థి కేవలం ఒకరోజు సెలవు కోసం ఇంకో విద్యార్థిని దారుణంగా దాడి చేసి హత్యమర్చిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
Husband news : భార్య మీద అనుమానంతో ఫస్ట్ నైట్ రోజునే అలా చేసిన భర్త..
పూర్తీ వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పురూలియా జిల్లాకి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలలో రాము (పేరు మార్చాం) అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. అయితే రాము చదువుతున్న పాఠశాలకి సంబందించిన హాస్టల్ లోనే ఉండేవాడు. కాగా రాము కి తన తల్లిదండ్రులను చూడాలనిపించి ఇంటికి వెళ్ళి రావాలని అనుకున్నాడు. దీంతో వెంటనే తమ పాఠశాలలోని సంబందిత ఉపాధ్యాయులను తనకి ఇంటికి వెళ్ళి రావడానికి ఒకరోజు సెలవు కావాలని అడిగాడు. కానీ ఇందుకు ఉపాధ్యాయులు అనుమంతిచ లేదు. దీంతో రాము తీవ్ర నిరాశకి గురయ్యాడు.

సరిగ్గా ఇదే సమయంలో గతంలో ఓ విద్యార్థి అనారోగ్యం కారణంగా కన్ను మూయడంతో పాఠశాలకి సెలవు ఇచ్చిన సంగతి రాము కి గుర్తుకొచ్చింది. ఇంకేముంది వెనుకాముందు మంచి చెడులు ఆలోచించకుండా ఓ విద్యార్థిని అంతమొందించి సెలవు పొందాలని నిర్ణయించుకున్నాడు.
Nagababu in Vizag : బీజేపీ తో పొత్తు పై స్పందించిన నాగబాబు..
MLA Roja : డైమండ్ రాణి అంటూ నటి రోజా పై కమెడియన్ సంచలనం.
సెలవు కోసం ఒకటో తరగతి విద్యార్థిని అలా..
ఈ క్రమంలో ఇదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడిని చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపించి ఒంటరిగా తనతో తీసుకెళ్ళి బండరాయితో బలంగా తలపై దాడి చేశాడు. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఆనంతరం బాలుడి మృతదేహాన్ని దగ్గరలో ఉన్న చెరువులో పడేసి సైలెంట్ గా హాస్టల్ కి వచ్చేశాడు. అయితే స్కూల్ కి వెళ్ళిన బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కొందరు బాటసారులు బాలుడి మృతదేహం చెరువులో పైకి తేలుతుండటం గమనించి స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. అప్పటికే విచారణ మొదలు పెట్టిన పోలీసులు రాము తో కలసి బాలుడు వెళుతున్న దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో రాము ని అదుపులోకి తీసుకుని విచారించగ అసలు విషయం బయట పడింది. ఏదేమైనప్పటికే కేవలం ఒక్కరోజు సెలవు కోసం రాము చేసిన పనికి మృతిడి తల్లిదండ్రులకి తీరని శోకం మిగిల్చింది.
