TDP-JSP alliance : వైసీపీ 151 టూ 20.. జనసేన 1 టూ 24.. ఇక అంతా జనసైనికుల చేతుల్లోనే, పవన్ మాస్టర్ ప్లాన్ ఇదే
జనసేన కు 24 సీట్స్ అనగానే ఇంతేనా అంటున్నారు చాలామంది.. వీటికోసమేనా ఇన్నాళ్లు కష్టపడింది.. వీటితో సీఎం అయిపోతామా అంటున్నారు కొందరు..సరిగా ఆలోచిస్తే అది ఎంతో తెలుస్తుంది.. రాజకీయాల్లో ఎపుడు ఏదైనా జరగవచ్చు.. అలానే టీడీపీ వాళ్ళు కొందరు ఎగిరెగిరి పడుతున్నారు. జనసేనకు కాస్త చులకనగా కూడా మాట్లాడుతున్నారు. ఇవి కాస్త తగ్గించుకుంటే మంచిది.
ముందుగా జనసైనికులు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉన్న 175 నియోజకవర్గాల్లో 24 పోగా మిగిలినవి ఎన్ని..?
151
ఒకవేళ రేపు వాటిలో టీడీపీకి సగం వైసీపీకి సగం వచ్చాయి అనుకుందాం.. అంటే.. 75 + 76 అపుడు ఎవరి అవసరం పడుతుంది..? ఒకవేళ జనసేన 24 కి 24 సీట్లు గెలిస్తే అపుడు పవన్ కోరుకుంటే సీఎం షేర్ వస్తుందా రాదా..? ఇపుడు చెప్పండి 24 ఎంత పెద్ద నంబరో.. 24 తో సీఎం అవ్వోచ్చో లేదో..?
కానీ పవన్ కళ్యాణ్ కి కావాల్సింది అలా జరగడం కాదు వైసీపీకి జనసేన కంటే తక్కువ సీట్స్ వచ్చేట్టు చేయడమే పవన్ మనసులో ఉంది.. జనసైనికులు తలచుకుంటే అది జరుగుతుంది కూడా.. పవన్ కళ్యాణ్ జనసైనికులు నుండి కోరుకుంటుంది కూడా అదే.. జనసేన 24 గెలవాలి.. టీడీపీ ని వీలైనన్ని ఎక్కువ సీట్స్ లో గెలిపించాలి. వైసీపీ ని తక్కువ సీట్స్ కి పరిమితం చేయాలి. వైసీపీ కంటే జనసేనకు ఎక్కువ సీట్స్ వస్తే అది జనసేనకు గర్వంగా ఉంటుందా ఉండదా..? అసలు నిజంగా అదే జరిగితే వైసీపీ లో ఎంత మంది నిలబడతారు..? 2014 లో చూసాం కదా..? అసలు వైసీపీ మనుగడ సాధించడమే కష్టం. అపుడు మిగిలేవి రెండు పార్టీలే.. ఒకటి టీడీపీ రెండు జనసేన.. పవన్ కోరుకుంటుంది కూడా అదే.. నిజమైన కార్యకర్త అధినేత మనసెరిగి నడుచుకోవాలి..
అలానే టీడీపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది.. జనసేన నిలబడిన ప్రతి చోటా జనసేనను ఖచితం గా గెలిపించాలి..టీడీపీ పోటీ చేస్తున్న చోట్ల పొరబాటున రేపు జగన్ కి కాస్త ఎక్కువ సీట్స్ వచ్చాయా జనసేన సీట్స్ ఎంతో కీలకం. కూటమికి వీటివల్లనే అధికారం దక్కవచ్చు. ఇక్కడ కూడా జగన్ కి ఎక్కువ వస్తే మళ్లీ జగన్ సీఎం అవుతాడు అన్నది తలకు ఎక్కించుకోవాలి. రేపు ప్రతి సీట్ ఎంతో కీలకం అవుతుంది. అన్ని సీట్స్ నెగ్గాల్సిందే.. జనసేన టీడీపీ కార్యకర్తలు ఒకరి పార్టీకి మరొకరు సంపూర్ణంగా మద్దతు ఇస్తేనే ఇది జరుగుతుంది. లేకుంటే పిల్లి పిల్లి తగవు కథ లా మారి రేపు జగన్ నక్కలా అధికారం ఎగరేసుకు పోతాడు.
అలానే ప్రతి జనసైనికుడు గుర్తు పెట్టుకోండి.. ఇది చాలా విలువైన సమయం మరియు చాలా తక్కువ సమయం. ఇతరుల మాటలు నమ్మకండి. మీ మనసును మాత్రమే నమ్మండి. పవన్ కళ్యాణ్ తప్పు చేయడు. ప్రతీదీ జనసైనికులు దగ్గరకు వచ్చి చెప్పలేరు. మనసు పెట్టి ఆలోచించండి. జనసేనాని ఆలోచన అర్ధం అవుతుంది. 3650 రోజులు కష్టపడ్డారు.. ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోయకండి. మీరు కోరుకునేది జరిగే ముందు క్లైమాక్స్ లో విలన్ వచ్చినట్టు చాలా మంది వస్తారు. మీతో మానసికంగా ఫైట్ చేస్తారు. మిమ్మల్ని divert చేస్తారు.
హీరోల్లా నిలబడండి. ఇంకా మిగిలింది 45 రోజులు కలిసి నడవండి.. కలసి గెలవండి. అధికారం లో భాగస్వామ్యులు కండి..
Srinivas Puppala