Yawning : మనిషికి ఆవలింతలు రావడం సహజం. రోజులు ఏదో ఒక సమయంలో మనం ఆవలిస్తూనే ఉంటాం అది మానవ జీవన ప్రక్రియలో ఒక భాగం. మనం గమనించినట్లయితే ఎదుటి వ్యక్తి ఎవరైనా ఆవలించినప్పుడు ఆటోమేటిగ్గా మనకు తెలియకుండా మనం కూడా ఆవలించేస్తూ ఉంటాం. అయితే ఈ ఆవలింతలు తక్కువ మోతాదులో వస్తే పర్లేదు కానీ అవసరం లేకుండా కూడా అత్యధికంగా అవలింతలు వచ్చినట్లయితే..అప్పుడు ఆలోచించాల్సిందే..
దానివల్ల ఆరోగ్య ప్రమాదం ఏమైనా జరగవచ్చా..? ఇప్పుడు తెలుసుకుందాం..కొందరు ఆవలింతలే కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి అవే ప్రమాదం కావచ్చు. రోజులో అత్యధికంగా ఆవలింతలు రావడం వల్ల కలిగే పరిణామాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే.. అత్యధికంగా ఆవలింతలు అనారోగ్యానికి సూచికలని వారు హెచ్చరిస్తున్నారు.

మనిషి అలసటకు గురైనప్పుడు, నిద్ర వచ్చే సమయంలో ఆవలింతలు రావడం సహజం. కానీ అదే పనిగా సరైన నిద్ర ఉన్నప్పటికీ తరచు ఆవలింతలు వస్తే మాత్రం అది అనారోగ్యానికి సంకేతం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా ఆవలింతలు వస్తే మన మెదడుకు సరైన ఆక్సిజన్ అందడం లేదని సూచికగా మనం భావించాలి.
మెదడుకు సరైన ఆక్సిజన్ అందకపోతే రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆవలింతలు ఆపకుండా వస్తే శరీరానికి తగిన శ్వాస అందడం లేదని మనం గమనించుకోవాలి. ఈ సమస్య ద్వారా ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక రోజులో మీకు ఎన్ని ఆవలింతలు వస్తున్నాయో.
