Bhimaa Movie Review : గోపీచంద్ ‘భీమా’ మూవీ యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ.. హిట్ పడ్డట్లేనా..
హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం భీమా. నేడు మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో, రాధామోహన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపీచంద్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. యుఎస్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ గమనిస్తే గోపీచంద్ భీమా చిత్రం యాక్షన్ లవర్స్ కి ఫీస్ట్ అని అంటున్నారు. సినిమా బిగినింగ్ ఎపిసోడ్, అలాగే ఇంటర్వెల్ సీన్ చాలా బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. 143 నిమిషాల నిడివితో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది.

పరశురాముని క్షేత్రం ప్రాంతంలో కథ మొదలవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో పాత్ర పరిచయం అవుతుంది. ఎద్దు పై గోపీచంద్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశం హైలైట్ అనిపించేలా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఎమోషన్స్ పూర్తి స్థాయిలో కాకపోయినా సోసోగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ సమీపించే సరికి ఇంటెన్సిటీ పెరిగిపోతుంది.
గోపీచంద్ ఈ చిత్రం కోసం తన ఫుల్ ఎనేర్జి ఇచ్చేశాడు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ తో పాటు వచ్చే ట్విస్ట్ ఇంటర్వెల్ లో ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో గోపీచంద్ విలన్ కి వార్నింగ్ ఇస్తూ చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టించే విధంగా ఉంటాయి. ఓవరాల్ గ్గా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని కాకపోయినా యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుంటుందని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.
