Gopichand Love Story : శ్రీకాంత్ మేనకోడలిని గోపీచంద్ ఎందుకు ప్రేమించాడో తెలుసా..మొహమాటంతో డైరెక్ట్ గా అడగలేక..
గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 8న భారీ అంచనాలతో ఈ చిత్రం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కి భీమా చిత్రంతో అయినా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
భీమా చిత్రం కోసం గోపీచంద్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అలీతో సరదాగా షోకి గోపీచంద్ అతిథిగా హాజరయ్యాడు. ఈ షోలో అలీ గోపీచంద్ వ్యక్తిగత విషయాలని కూడా ప్రస్తావించాడు. గోపీచంద్ భార్య రేష్మ గురించి అలీ ప్రశ్నించాడు. దీనితో గోపీచంద్ తన లవ్ స్టోరీ మొత్తం వివరించాడు. గోపీచంద్ రేష్మని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడట. రేష్మ ఎవరో కాదు.. సీనియర్ హీరో శ్రీకాంత్ కి స్వయానా మేనకోడలు.
గోపీచంద్ మాట్లాడుతూ టాలీవుడ్ లో శ్రీకాంత్ గారితో పరిచయం ఉంది. ఆయన మేనకోడలు రేష్మని ఒక ఈవెంట్ లో చూసి ఇష్టపడ్డా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. కానీ గోపీచంద్ స్వతహాగా కాస్త సిగ్గు ఎక్కువ ఉన్న వ్యక్తి. దీనితో ఎలా అప్రోచ్ కావాలో అర్థం కాలేదట. డైరెక్ట్ గా శ్రీకాంత్ గారిని అడిగితే బాగోదు.
Gopichand : వాళ్ళని నమ్మి నష్టాల పాలైన గోపీచంద్.. ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకుండా ఎందుకు దాచాడంటే
దీనితో తన మనసులో మాటని నటుడు చలపతి రావుకి చెప్పాడట. దీనితో చలపతి రావు.. టెన్షన్ పడకు నేను శ్రీకాంత్ తో మాట్లాడి సెట్ చేస్తా అని అన్నారు. చెప్పినట్లుగానే శ్రీకాంత్ కి చెప్పి పెళ్లికి ఒప్పించడంతో పాటు అన్ని పనులు ఆయనే ముందుండి చేశారు అని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు. పెళ్లి ఫిక్స్ అయిన వెంటనే రేష్మ తనకి టీ షర్ట్ గిఫ్ట్ గా పంపింది అని గోపీచంద్ సిగ్గు పడుతూ చెప్పాడు. ఆ విధంగా గోపీచంద్ ఓ ఇంటివాడయ్యాడన్నమాట.