Meetha Raghunath Wedding: హడావిడి లేకుండా పెళ్లి చేసేసుకున్న ‘గుడ్ నైట్’ హీరోయిన్.. ఆమె భర్తని చూశారా
గత ఏడాది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన ముద్దు గుమ్మల్లో మీతా రఘునాథ్ ఒకరు. గుడ్ నైట్ చిత్రంతో మీతా ఒక్కసారిగా ఫేమస్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా యువత ఆమె జపం చేశారు. అయితే సినిమాల్లో అంతలా గ్లామర్ ఒలకబోసిందా అని అనుకోవద్దు. ఆమె ఎలాంటి గ్లామర్ ప్రదర్శించలేదు.
కానీ యువత హృదయాలు దోచుకునేలా నటించింది. గురక సమస్యతో బాధపడుతున్న భర్తని భరిస్తూ మీతా నటించిన విధానం అదుర్స్. భర్త కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడిన భార్యగా నటించింది. దీనితో యువత మొత్తం ఇలాంటి భార్య కావాలని కలలు కనేలా చేసింది.
View this post on Instagram
గుడ్ నైట్ చిత్రంతో అంతటి పాపులారిటీ సంపాదించిన మీతా సినిమాలతో బిజీ అవుతుందని భావిస్తే ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసేసుకుంది. పట్టు చీర ధరించి తన భర్తతో ఉన్న ఫొటోస్ ని మీతా అభిమానులతో పంచుకుంది. అయితే తన భర్త గురించి మీతా ఎలాంటి వివరాలు తెలియజేయలేదు.
ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ చూడ ముచ్చటగా ఉన్నారు. మీతా శారీ లుక్ లో అదరగొడుతోంది. తన సొంత ఊరు ఊటీలో మీతా కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆమె ఇకపై సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.