Rakul Preet Singh : పొట్టి బట్టలు ధరించడం మానను.. నా భర్తకి, అత్తా మామకి అభ్యంతరం లేదు.. రకుల్ కామెంట్స్
టాలీవుడ్ లో చాలా కాలం పాటు రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. రాంచరణ్, నాగ చైతన్య, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే కొంతకాలంగా రకుల్ హవా టాలీవుడ్ లో తగ్గింది. దీనితో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ వెళ్లక తప్పలేదు. అయితే ఈ ముద్దుగుమ్మకు అక్కడ కూడా అవకాశాలు అంతంత మాత్రమే.
గత నెల ఫిబ్రవరి 21 న రకుల్ గోవాలో తన ప్రియుడు జాకీ భగ్నానికి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రకుల్ పెళ్ళైన వెంటనే సోషల్ మీడియాలో గ్లామర్ షో మొదలు పెట్టేసింది. ఫోటో షూట్స్ చేస్తూ యువతని కవ్వించేలా పొట్టి దుస్తుల్లో ఫోజులు ఇచ్చింది. పెళ్ళైన వెంటనే ఇలా చేస్తే సహజంగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
పెళ్లి తర్వాత కూడా ఈ గ్లామర్ గోల ఏంటి అని రకుల్ ని ట్రోల్ చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో దీని గురించి రకుల్ స్పందించింది. పెళ్లి తర్వాత మీ డ్రెస్సింగ్ విధానం మార్చుకోమని మీ అత్తా మామఅడిగారా అని ప్రశ్నించగా రకుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నా భర్త కానీ అతడి కుటుంబ సభ్యులు కానీ నా డ్రెస్సింగ్, ఫ్యాషన్ మార్చుకోమని చెప్పలేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. పెళ్లిని ఇండియాలో చాలా విభిన్నంగా చూస్తారు. ఇదే ప్రశ్న మీరు పెళ్లైన అబ్బాయిలని అడగగలరా అని రకుల్ మండిపడింది. పెళ్లి తర్వాత అబ్బాయిలు ఆఫీస్ లకు ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని వెళ్లడం మీరు చూశారా అని ప్రశ్నించింది.
కాలం మారుతోంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇష్టాలు, అభిప్రాయాలు ఉంటాయి. నా ఇష్టాలని నేను గౌరవిస్తాను. నా వృత్తిలో కొనసాగుతాను అని రకుల్ క్లియర్ గా తేల్చి చెప్పేసింది. పెళ్లి తర్వాత తన డ్రెస్సింగ్ లో మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చేసింది.