Suma Kanakala : యాంకర్ సుమకి ఎమోషనల్ గిఫ్ట్ ఇచ్చిన హీరో శ్రీవిష్ణు.. కన్నీళ్లు తెప్పించారుగా
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. మీడియం బడ్జెట్ లో మినిమమ్ గ్యారెంటీ చిత్రాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. శ్రీవిష్ణు చివరగా సామజవరగమన చిత్రంలో రొమాంటిక్ కామెడీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీవిష్ణు నటించిన ఓం భీం బుష్ చిత్రం మార్చి 22న రిలీజ్ అవుతోంది.
ఈ చిత్రంలో శ్రీవిష్ణు తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించారు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. దీనితో శ్రీవిష్ణు అండ్ టీం గట్టిగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి సుమ అడ్డా షోకి హాజరయ్యారు.
ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెడీ పంచ్ లతో ఈ ముగ్గురు సుమకి చుక్కలు చూపించారనే చెప్పాలి. రాహుల్ రామకృష్ణ, శ్రీవిష్ణు, ప్రియదర్శి సుమకి ఊపిరాడనివ్వకుండా సెటైర్లు వేసారు. వాళ్ళ సెటైర్లకు సుమ ఇచ్చిన హావా భావాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.
శ్రీవిష్ణు తొలిప్రేమ గురించి సుమ అడిగింది. శ్రీవిష్ణు సమాధానం ఇస్తూ మా అనకాపల్లిలో వెంకటరామ థియేటర్ లో చూశానని శ్రీవిష్ణు అంటాడు. నేను అడిగేది పవన్ కళ్యాణ్ తొలిప్రేమ గురించి కాదు మీ తొలిప్రేమ గురించి అని సుమ చెబుతుంది. అవును ఆ చిత్రంలోనే పవన్ కళ్యాణ్ ని ప్రేమించా అని శ్రీవిష్ణు ఇచ్చిన సమాధానం.. దానికి సుమ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ పొట్టచెక్కలయ్యేలా చేశాయి.
సుమని నవ్వించిన వీళ్ళు చివర్లో ఎమోషనల్ అయ్యేలా చేశారు. మార్చి 23న సుమ తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోబోతోంది. అడ్వాన్స్ గా ఆమె బర్త్ డే సెలెబ్రేట్ చేయాలనీ ఓం భీం బుష్ హీరోలు డిసైడ్ అయ్యారు. సుమకి సర్ప్రైజ్ ఇచ్చే విధంగా ఆమె నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నుంచి వృద్దులని షోకి తీసుకువచ్చారు. వారి సమక్షంలోనే సుమ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. వారు చూపించిన ప్రేమకి సుమ ఎమోషనల్ అయింది.