Surya Kiran Death : కళ్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ ఆ తప్పు చేయడం వల్లే మరణించారు.. కరాటే కళ్యాణి భావోద్వేగం
సత్యం లాంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు సూర్య కిరణ్ జీవితం విషాదాంతంగా ముగిసింది. సూర్య కిరణ్ సినీ బ్యాగ్రౌండ్ చాలానే ఉంది. 90 దశకంలో చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల చిత్రాల్లో బాల్య నటుడిగా నటించాడు. అతడి సోదరి సుజిత పసివాడి ప్రాణం చిత్రంలో మాటలు రాని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం టివి సీరియల్స్ లో నటిస్తూ రాణిస్తోంది.
ఇక సూర్య కిరణ్ సోమవారం రోజు పచ్చ కామెర్లతో భాదపడుతూ మరణించారు. అతడి వయసు కేవలం 48 ఏళ్ళు మాత్రమే. సూర్య కిరణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. అంతకు ముందు సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, దొంగోడు, పెదబాబు, వసంతం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హోమ్లీ బ్యూటీగా కళ్యాణి చెరగని ముద్ర వేసింది. అయితే సూర్య కిరణ్, కళ్యాణి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. భార్య నుంచి విడిపోయిన తర్వాత సూర్య కిరణ్ అధికంగా మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది.
Saranya Pradeep : పుష్ప జగదీశ్ కేసుపై అంబాజీ పేట నటి కామెంట్స్.. అతడి వ్యక్తిత్వంపై ఇలా..
సూర్య కిరణ్ తో పాటు నటి కరాటే కళ్యాణి బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ కరాటే కళ్యాణి భావోద్వేగానికి గురైంది. సూర్య కిరణ్ చాలా మంచి వ్యక్తి. కానీ భార్యతో విడిపోవడం వల్ల మానసికంగా కుంగిపోయాడు అని కరాటే కళ్యాణి తెలిపింది.
Konidela Surekha : ఆయన లాగే కళ్యాణ్ బాబు.. చిరు, పవన్ ఆహారపు అలవాట్లపై సురేఖ వ్యాఖ్యలు
ఎప్పటికైనా తన భార్య తిరిగి వస్తుందేమో అనే ఆశతో ఉన్నాడు. విపరీతంగా మద్యానికి సిగరెట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కామెర్లు వచ్చినా గుర్తించలేదు. కామెర్లు ఉన్నప్పుడు కూడా మద్యం తీసుకోవడంతో ఆరోగ్యం విషమించినట్లు కరాటే కళ్యాణి పేర్కొంది. కామెర్లని గుర్తించి.. మద్యం ఆపేసి చికిత్స తీసుకుని ఉంటే సూర్య కిరణ్ బతికేవారని భావోద్వేగానికి గురైంది.
