SV Krishna Reddy : ఇప్పుడంటే కొంతమంది దర్శకులకి సరైన సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కానీ ఒకప్పుడు మాత్రం ఇండస్ట్రీకి వరుస హిట్లు ఇచ్చి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే 90’స్ కాలంలో అమ్మ సెంటిమెంట్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ అలాగే మరిన్ని ప్రేమ తరహా చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి గారు కేవలం దర్శకత్వ విభాగంలో మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించి బాగానే ఆకట్టుకున్నారు.
SV Krishna Reddy మాయలోడు చిత్రం హిట్:
అయితే ఎస్వీ కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన చిత్రాలలో మాయలోడు చిత్రం ఒకటి. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా ప్రముఖ సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరియు ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ గా మరియు కమర్షియల్ గా బాగానే హిట్ అయింది. అయితే తాజాగా దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి ఓ ప్రముఖ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం తెరకెక్కించే సమయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
YCP MP Balashauri Joins Janasena Party : జనసేనలోకి బాలశౌరి జంప్… వైసీపీకి భారీ షాక్..
రాజేంద్ర ప్రసాద్ స్థానంలో బాబు మోహన్ :
ఇందులో భాగంగా ఈ చిత్రం తెరకెక్కించే సమయంలో హీరో రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తనని బాధించాయని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా డబ్బింగ్ చెప్పే విషయంలో అలాగే మాయలోడు చిత్రంలో మంచి హిట్ అయిన చినుకు చినుకు అందెలతో పాట తెరకెక్కించే విషయంలో కూడా రాజేంద్రప్రసాద్ గారు కొంతమేర తనని ఇబ్బంది పెట్టారని దాంతో ఈ పాటలో ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు కమేడియన్ బాబు మోహన్ గారిని నటింపజేయాలని వచ్చిందని తెలిపాడు.
అయితే ఈ పాటలు బాబు మోహన్ గారిని నటింపచేయాలని అనుకున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు తనకు సంబంధించిన కొంతమంది మధ్యవర్తుల ద్వారా ఈ పాట చిత్రీకరణను ఆపాలని చూసినట్లు కూడా చెప్పుకొచ్చాడు. కానీ తాను మాత్రం తన కమిట్మెంట్ కి కట్టుబడి ఆ పాటని తెరకెక్కించాలని దీంతో ఒకరకంగా ఈ పాట ఈ చిత్ర రిజల్ట్స్ నేను మార్చేసిందని కూడా తెలిపాడు. అయితే ఈ సంఘటన జరిగే ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ ఇప్పుడు బయట పెట్టడం ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
“గుంటూరు కారం” రివ్యూ :
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల ఎస్వి కృష్ణారెడ్డి తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన “గుంటూరు కారం” చిత్రం రివ్యూ విషయంలో కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో ముఖ్యంగా సినిమాలు ఎప్పుడూ కూడా కథను బేస్ చేసుకుని తీయాలని అలా కాకుండా హీరో హీరోయిన్ల కోసం కథలో మార్పులు చేర్పులు చేస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయని సంచల వ్యాఖ్యలు చేశాడు.