Taapsee Pannu : నాకు సిగరెట్, మందు తాగే అలవాటు లేదు..అందుకే అనంత్ అంబానీ వెడ్డింగ్ పార్టీకి వెళ్ళలేదు
ఝుమ్మంది నాదం చిత్రంతో సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాప్సి అందరిలాగా సర్దుకుపోయే రకం కాదు.. తేడా వస్తే ఘాటుగానే నోటికి పని చెబుతుంది. ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా తొలి చిత్రంలోనే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించే ఛాన్స్ తాప్సి కి దక్కింది. ఆ చిత్రం తర్వాత తాప్సి పలు సందర్భాల్లో రాఘవేంద్ర రావుని నేరుగా విమర్శించింది.
తన నడుముపై పళ్ళు, టెంకాయలు వేయడం ఏంటని.. దర్శకుల మనస్తత్వం ఏంటని పలు ఇంటర్వ్యూలలో తాప్సి మండిపడింది. సౌత్ చిత్రాల్లో నటీమణులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని కూడా తాప్సి విమర్శించడం చూశాం. అయితే తాజాగా తాప్సి అనంత్ అంబానీ వెడ్డింగ్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండియా మొత్తం దుమారం రేపెలా కనిపిస్తున్నాయి.
తాప్సి పెద్దగా పార్టీల్లో కనిపించదు. ఇటీవల అనంత్ అంబానీ వెడ్డింగ్ పార్టీకి బాలీవుడ్ మొత్తం తరలి వెళ్ళింది. కానీ తాప్సి మాత్రం హాజరు కాలేదు. మీరెందుకు పార్టీలకు వెళ్ళరు అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తాప్సి ఇచ్చిన సమాధానం బోల్డ్ గా ఉంది.
నాకు మందు, సిగరెట్ తాగే అలవాటు లేదు. కాబట్టి పార్టీలకు వెళితే ఏం చేయాలో తెలియదు. అందుకే పార్టీలకు వెళ్ళను. అంతే కాదు రాత్రి 10 తర్వాత నాకు మేల్కొనే అలవాటు కూడా లేదు. నేను త్వరగా నిద్ర లేస్తాను. అలాగే త్వరగా పడుకుంటాను అని తాప్సి తెలిపింది.
కొంతమంది నాకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. పెద్ద స్టార్స్ కి మెసేజ్ లు పెట్టాలట. అలా చేస్తే వారి బర్త్ డే పార్టీలకి నన్ను కూడా ఆహ్వానిస్తారు అని చెప్పారు. ఆ అలవాటు కూడా నాకు లేదు అని తాప్సి పేర్కొంది. నాకు పరిచయం లేని వ్యక్తులతో నేను పార్టీ చేసుకోను. పార్టీలకు వెళ్లకపోతే అవకాశాలు రావని కూడా అంటారు. నిజమే కావచ్చు. నేను ఇప్పటి వరకు నా కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఈ స్థాయికి వచ్చినట్లు తాప్సి పేర్కొంది.