Vishnupriya తెలుగు యాంకర్ విష్ణుప్రియ సీనియర్ హీరో ని పెళ్లాడ బోతోందా..?
Vishnupriya Marriage 90స్ కాలంలో సత్య, బొంబాయి ప్రియుడు, గులాబీ, అలాగే మరిన్ని హిట్ చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ హీరో జేడి చక్రవర్తి గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే జేడి చక్రవర్తి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాగానే కష్ట పడ్డాడు. ఈ క్రమంలో హీరోగా మంచి సినిమాల్లో నటించే ఆఫర్లు దక్కించుకుని బాగానే రాణిస్తున్న సమయంలో డైరెక్షన్ వైపు మనసు మళ్ళడంతో అటువైపు గా వెళ్ళాడు.

జేడి చక్రవర్తి సినీ కెరియర్:
కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేక పోయాడు. ఈ క్రమంలో ఇటు హీరోగా కూడా ఆఫర్లను కొల్పోయాడు. దీంతో కొంతకాలంపాటు ఆఫర్లు లేక ఇంటి పట్టునే ఉన్నాడు జేడి చక్రవర్తి. కాగా ఇటీవలే జేడి చక్రవర్తి మళ్లీ కెరియర్ లో పుంజు కునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాలు, వెబ్ సీరీస్ లు అంటూ ఫుల్ బిజీ గా ఉంటున్నాడు. అయితే తాజాగా జేడి చక్రవర్తి ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Kashmira Pardeshi Latest : తెలుగు సినిమాలో మరో అవకాశం దొరకటం తన భాగ్యం అంటున్న మరాఠీ చిన్నది..
Samantha : డబ్బు కోసం ఆ పని చేస్తున్న సామ్..
Samantha : సినిమాల విరామం కాస్తంతే అంటున్న సమంత..
జేడి చక్రవర్తితో యాంకర్ విష్ణుప్రియ పెళ్లి:
ఈ క్రమంలో తెలుగు ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ తో తన పెళ్లి జరగబోతున్నట్లు వినిపిస్తున్న వార్తపై కూడా స్పందించాడు. ఇందులో భాగంగా తాను విష్ణు ప్రియ ఇటీవలే దయా అనే తెలుగు వెబ్ సీరీస్ లో కలసి నటించామని ఈ క్రమంలో విష్ణు ప్రియ కి తనపై అభిమానం పెరిగిందని అలాగే తమది గురువు, శిష్యురాలు బందమని తెలిపాడు. అంతేతప్ప తాను, విష్ణు ప్రియ పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తల లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.
Tollywood Star Heroines : స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న యంగ్ బ్యూటీస్..
Telugu Heroine Ankitha – యూఎస్ లో సెటిల్ అయిన మాజీ తెలుగు హీరోయిన్
యాంకర్ విష్ణుప్రియ పెళ్లి కామెంట్లు:
కాగా గతంలో యాంకర్ విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యు లో జేడి చక్రవర్తి తల్లి ఒప్పుకుంటే అతడిని పెళ్లి చేసుకుంటానని కామెంట్లు చేసింది. అందుకే వీరిద్దరి పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ జేడీ చక్రవర్తి ఈ ఇంటర్వ్యు ద్వారా క్లారిటీ ఇవ్వడంతో వీరిద్దరి పెళ్లి గురించి వినిపిస్తున్న వార్తలకు పులిస్తాఫ్ పడింది..