Telugu Heroine Ankitha – యూఎస్ లో సెటిల్ అయిన సింహాద్రి మూవీ హీరోయిన్…
Telugu Heroine Ankitha – కొంతమంది హీరోయిన్లకి సినిమా ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే మంచి ఫేమ్ లభించినప్పటికీ తమ తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కెరీయర్ని కోల్పోయినవారు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ఇక వరుసగా సినిమా ఆఫర్లతో రాణిస్తున్న సమయంలో ఫుడ్ డైట్ పై దృష్టి సారించక పోవడంతో శరీరాకృతిలో మార్పులు వచ్చి ఫెడౌట్ అయిన హీరోయిన్స్ కూడా లేకపోలేరని చెప్పవచ్చు. అయితే తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు వెటరన్ హీరోయిన్ అంకిత సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.
Ankitha Movie Career:
హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు, ప్రేమలో పావని కళ్యాణ్, విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు, తదితర చిత్రాలలో కనిపించింది. కానీ అంకిత ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా అలాగే స్పెషల్ సాంగ్స్, చిన్నచితకా పాత్రలలో కనిపించింది. దీంతో కెరియర్ పరంగా పెద్దగా క్లిక్ కాక పోయినప్పటికీ, ఒకటి రెండు చిత్రాలతో తనకంటూ గుర్తింపు మాత్రం బాగానే తెచ్చుకుంది.

Sreemukhi Hot Pics : కూల్ క్లైమేట్ లో శ్రీముఖి హాట్ పిక్స్..
Sreeleela Hot Pics : చూపులతో మత్తెక్కిస్తున్న యంగ్ బ్యూటీ..
అంకిత వ్యక్తిగత జీవితం:
ఇక కెరియర్ పరంగా అవకాశాలు తగ్గిపోయిన సమయంలో విశాల్ జగపతి అనే ఎన్ఆర్ఐ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా విశాల్ జగపతి ఓ ప్రముఖ బ్యాంకులో ఉన్నత హోదాలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అంకిత కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా పెళ్లయిన తర్వాత అంకిత తన భర్త పిల్లలతో కలిసి తన భర్తతో కలిసి యునైటెడ్ స్టేట్స్ లోని న్యూ జెర్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
రీ ఎంట్రీ:
అయితే అంకిత కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుండడంతో మళ్లీ అంకిత సినిమా ఇండస్ట్రీకి ఇస్తుందా..? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు నటి అంకిత మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
Kavya Kalyan Ram – ఆడిషన్స్ కి వెళితే అలా ఉన్నావంటూ అవమానించారు…
Urvashi Rautela Remuneration – నిమిషానికి కోటి అడుగుతున్న ఊర్వశి..
రస్నా యాడ్ తో ఫేమస్:
అయితే అంకిత 1984వ సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రస్నా ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించింది. పెద్దయిన తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, తదితర భాషలలో కలిపి దాదాపుగా డజనుకు పైగా చిత్రాలలో నటించింది. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి నటసింహం బాలకృష్ణ, నవదీప్, అల్లరి నరేష్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
అయితే కెరియర్ లో వరుస సినిమాలతో బిజీబిజీగా రాణిస్తున్న సమయంలో ఫుడ్ డైట్ పై అలాగే బాడీ ఫిట్నెస్ పై దృష్టి సారించలేకపోయింది. దీంతో శరీరాకృతిలో మార్పులు చేసుకోవడంతో ఒకానొక సమయంలో బాగానే బరువు పెరగడంతో ఆఫర్లు కోల్పోయి కెరీర్ ని కూడా పోగొట్టుకుంది నటి అంకిత.