Varun Sandesh wife Vithika : పిల్లల్ని ఎప్పుడు కంటారు ? నెటిజన్ల ప్రశ్నకు వరుణ్ సందేశ్ భార్య దిమ్మతిరిగే సమాధానం
కెరీర్ బిగినింగ్ లో హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం ఇలా వరుస హిట్స్ తో వరుణ్ సందేశ్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కెరీర్ బాగా డౌన్ ఫాల్ అయింది. ఇటీవల కొన్ని ప్రయత్నాలు చేస్తున్న వర్కౌట్ కావడం లేదు. అతడి సతీమణి వితిక షెరు కూడా నటే. భీమిలి కబడ్డీ జట్టు లాంటి చిత్రాల్లో నటించింది.
వీళ్లిద్దరి జంటగా పడ్డానండి ప్రేమలో మరి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్ర షూటింగ్ లో నిజంగానే ప్రేమలో పడ్డారు. 2016లో పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. అయితే పిల్లలని ఎప్పుడు కంటారు అనే ప్రశ్న వితికకి తరచుగా ఎదురవుతూనే ఉందట.
వీరి వివాహం జరిగి 8 ఏళ్ళు కావడంతో వితికకి సోషల్ మీడియాలో పిల్లల గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనితో విసిగిపోయిన వితిక తాజాగా కూల్ గానే అదిరిపోయే సమాధానం ఇచ్చింది. వితిక సమయస్ఫూర్తి అద్భుతం.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది అంటూ నెటిజన్లే ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
పిల్లలు ఎప్పుడు అని అడిగిన నెటిజన్లకు వితిక ఏమని సమాధానం ఇచ్చిందంటే.. తన ఒడిలో పడుకుని ఉన్న వరుణ్ సందేశ్ ని చూపిస్తూ ఇదిగో ఈ పిల్లాడు పెద్దవాడు అయ్యాక అంటూ బదులిచ్చింది. వితిక కారులో ప్రయాణిస్తుండగా ఆమె ఒడిలో పడుకుని వరుణ్ సందేశ్ నిద్రిస్తున్నాడు. తన భర్త తనకి చిన్న పిల్లాడేనని వితిక క్యూట్ గా చెప్పకనే చెప్పింది.
వరుణ్ సందేశ్, వితిక బిగ్ బాస్ సీజన్ 3లో జంటగా పాల్గొన్నారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన నెగిటివిటితో వితిక కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిందట. కానీ తన భర్త సహాయంతో డిప్రెషన్ నుంచి కోలుకున్నట్లు గతంలో తెలిపింది.