Baby Movie : నటుడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగానే కాకుండా.. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయినా.. ఆనంద్ తన నటనతో మెప్పించాడు. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక లేటస్ట్‌గా బేబి అంటూ పలకరించాడు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా బేబి. విరాజ్ అశ్విన్ సెకెండ్ హీరోగా నటించాడు. ఆనంద్ దేవరకొండ కెరీర్ లో తొలి థియేట్రికల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ భగ్న ప్రేమికుడిగా కనిపిస్తాడు. క్లైమాక్స్ లో ప్రియురాలు చేసిన మోసానికి ముందుకు బానిసవుతాడు. తిండి నిద్ర లేకుండా ప్రేయసి ఊసులతో బ్రతికేస్తాడు. లవ్ ఫెయిల్యూర్ తో ముందుకు అలవాటు పడ్డ యువకుడిగా నటించి మెప్పించాడు.
Sai Dharam Tej : సమంత బాటలో సాయిధరమ్ తేజ్..
తాజాగా ఈ మూవీ దర్శకుడు హీరో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సన్నివేశాలు సహజంగా రావడానికి ఆనంద్ దేవరకొండ నిజంగానే మందు తాగాడట. ప్రతిరోజూ పరగడుపున టకీలా మూడు షాట్స్ వేయించేవారట. రోజంతా వోడ్కాలో కొబ్బరి నీళ్లు కలిపి తాగించారట. డైరెక్టర్ సాయి రాజేష్ ఏం చెబితే ఆనంద్ అది తప్పకుండా చేసేవాడట. నిల్చుంటే రోగాలు వస్తాయేమో అన్నట్లున్న పరిసరాల్లో ఆనంద్ నటించాడు. ఈ మూవీలో పాత్ర కోసం అతడు ఎంతో కష్టపడ్డాడు. తన డెడికేషన్ అద్భుతమంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.
Baby OTT : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబీ..