Baby Movie : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా విరాజ్ అశ్విన్ మరో ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘బేబి’. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు. యూత్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో వచ్చిన ‘బేబి’ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. బేబి చిత్రాన్ని శ్రీనివాస కుమార్ (ఎస్‍కేఎన్) సుమారు 10 కోట్ల బడ్జెట్ తో తీస్తే..

ఇప్పుడు ఈ మూవీ వసూళ్ల పంట పండిస్తోంది. 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.60.3కోట్ల గ్రాస్ కలెక్షన్‍లను వసూలు చేసింది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ మూవీ ఈ స్థాయిలో వసూళ్లను రాబడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే బేబీ సినిమాకు సంబంధించి.. ఓ ఆసక్తికర విషయం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, చైతన్య, విరాజ్ అశ్విన్ రెమ్యునరేషన్ మీద చర్చ నడుస్తోంది.
Rakul Preet Singh Hot Pics : కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేస్తున్న రకుల్..
ఆనంద్ కు రూ.80 లక్షలు, వైష్ణవికి రూ.30 లక్షలు, విరాజ్ కు రూ.20 లక్షల పారితోషికం ఇచ్చారంటూ.. పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. సినిమాలో కొన్ని డైలాగ్‌ల విషయంలో విమర్శలు రావడంతో వాటిపై స్పందిస్తూ.. “ముందు తెరవాల్సింది కళ్ళు కాదు.. కాళ్లు అనే అసభ్యకరమైన డైలాగ్ రాసినందుకు చింతిస్తున్నాను. బేబిలో ఆ డైలాగ్‌ను రాసినందుకు క్షమించండి అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Alia Bhatt: నా కూతురు నాలా సినిమాల్లోకి రాకూడదు.. నేను నిద్ర మానుకొని ఏకధాటిగా..