Bro Prerelease Event : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతుంది. మరికొన్ని రోజుల్లో మామ అల్లుళ్ళు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. ఇప్పటికే బ్రో నుంచి వచ్చిన సినిమా టీజర్, ట్రైలర్ అంసరినీ ఆకట్టుకుంది. ట్రైలర్‌లో మామా అల్లుళ్ల హంగామా, డైలాగ్స్, స్టైల్ అదిరిపోయాయి. ఇక బ్రో సినిమా జూలై 28న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు.
అయితే ఈ ఈవెంట్ లో స్వల్ప మార్పులు చేస్తూ మూవీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో వర్షం పడుతోన్న క్రమంలో పోలీసుల సూచన మేరకు ఈవెంట్ సమయంలో మార్పులు చేశారు. సాయంత్రం 6 గంటలకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చే సమయం కావడం, అప్పుడే ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రారంభంకానుండడంతో ఈవెంట్ సమయాన్ని మార్చారు. ప్రిరిలీజ్ ఈవెంట్ కార్యక్రం రాత్రి 8.30 గంటలకు ప్రారంభించనున్నారు.
Ram Charan 1st Remuneration : రామ్ చరణ్ మొదటి సంపాదనతో ఏం చేసాడో తెలుసా..!?
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో సాయి తేజ్ సరసన కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఒరిజినల్ స్టోరీలో మార్పులు చేసి మన నెటివిటీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
⚠️
Requesting your attention, Dear Fans & Followers
Celebrating your love will be a lil late but above Grand.
Please bear with us and let us all join the Power Packed Grand Pre-Release Event of #BroTheAvatar, Today at 8:30PM.#BROPreReleaseEvent@PawanKalyan @IamSaiDharamTej… pic.twitter.com/EChVXdfxNm
— Vamsi Kaka (@vamsikaka) July 25, 2023