Eagle Movie OTT : ఈగల్ స్ట్రీమింగ్ అయ్యేది ఈ ఓటిటి లోనే..
ఒక్క సినిమా హిట్ ఇస్తే వరుసగా మూడు నాలుగు ప్లాప్ లు ఇవ్వడం మాస్ మహారాజా రవితేజ కు అలవాటు. అప్పుడెప్పుడో ధమాకా తో బ్లాక్ బాస్టర్ కొట్టాడు ఆతరువాత తను కీలక పాత్రలో నటించిన వాల్తేరు వీరయ్య కూడా బ్లాక్ బాస్టర్ అయ్యింది కానీ ఈ విజయం రవితేజ ఖాతాలో పడదు.ధమాకా తరువాత సోలో హీరోగా చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు తో డిజాస్టర్ లు ఇచ్చాడు.ఇక ఈనెలలో ఈగల్ అంటూ వచ్చాడు.అయితే గత రెండు సినిమాలకంటే ఈసినిమాకు టాక్ బాగానే వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే కలెక్షన్స్ రాలేదు. పాపం సంక్రాంతి కి రిలీజ్ చేసుకున్నా ఇప్పుడు వచ్చిన టాక్ తో హిట్ అయ్యేది కానీ పోటీ ఎందుకని తప్పుకొంటే నష్టపోయాడు.
కార్తీక్ ఘట్టమనేని ఈసినిమాను డైరెక్ట్ చేయగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. అనుపమ పరమేశ్వరన్ , నవదీప్ కీలక పాత్రల్లో కనిపించారు.రిజల్ట్ సంగతి పక్కన పెడితే రవితేజ ను డైరెక్టర్ బాగా ప్రెజెంట్ చేశాడు అంతే కాదు కొన్ని యాక్షన్ సీక్వెన్క్ ను కూడా బాగా డిజైన్ చేశారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మించింది.
ఇక సినిమాల రిజల్ట్ గురించి రవితేజ పట్టించుకోడు అంతేకాదు ఏడాదికి మినిమం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటాడు.గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈహీరో మిస్టర్ బచ్చన్ లో నటిస్తున్నాడు. ఈసినిమా హిందీ లో హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్ గా వస్తుందని అంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఈసినిమా కాకుండా రవితేజ మరో సినిమాకు కూడా సైన్ చేశాడని టాక్.జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్,రవితేజ కోసం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథ ను సిద్ధం చేశాడట.రవితేజ కూడా ఓకే చెప్పాడట.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.త్వరలోనే ఈసినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.
Discussion about this post