Gopichand Bheema : భీమా ట్రైలర్ వచ్చేస్తుంది..!!
ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొని వరుస సక్సెస్ లు చూశాడు హీరో గోపిచంద్. లక్ష్యం ,యజ్ఞం , రణం , శౌర్యం,లౌక్యం ఇవన్నీ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. అయితే గత కొన్ని ఏళ్ళ నుండి ఎన్ని సినిమాలు చేసిన సరైన హిట్ లేకా బాగా వెనకబడి పోయాడు.అలా అని ఎక్కడా గ్యాప్ తీసుకోలేదు వరస బెట్టి సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు.ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు ప్రాజెక్టులు వున్నాయి.అందులో భీమా ఒకటి. కన్నడ డైరెక్టర్ హర్ష ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రచార చిత్రాలతో సినిమాకు బజ్ వచ్చింది. వరస పరాజయాలతో గోపిచంద్ మార్కెట్ దారుణంగా పడిపోయింది.
Gopichand Bheema : ట్రైలర్ రేపు సాయంత్రం నాలుగు గంటలకు..
అయితే భీమా మాత్రం సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది.డిస్ట్రిబ్యూటర్ల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయట.దాదాపు 20కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసే ఛాన్స్ ఉందట.ఇక ఈసినిమా ట్రైలర్ ను రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదలచేయనున్నారు.మరి ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తారో లేదో చూడాలి.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో గోపిచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడిగా మాళవిక శర్మ కనిపించనుంది.కెజియఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.శివరాత్రి రోజున మార్చి 8న ఈసినిమా విడుదలకానుంది.
Pawan Kalyan : కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం కోనసీమలో కార్యరూపంలోకి వచ్చింది
ఇక ఈసినిమాతో పాటు గోపిచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల తో కూడా సినిమా చేస్తున్నాడు.గత కొంత కాలంగా శ్రీను వైట్ల కి కూడా సక్సెస్ లేదు.అయితే ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టి ట్రాక్ లోకి రావాలని పట్టుదలతో వున్నాడు అందుకే తన కంఫర్ట్ జోన్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే ఇటలీ లో ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. చిత్రాలయం స్టూడియోస్ ఈసినిమాను నిర్మిస్తుండగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
కుర్రాళ్ళ హర్ట్ బీట్ పెంచేస్తున్న కావ్య థాపర్..
Discussion about this post