HariHara VeeraMallu Update : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఫీస్టే.. హరిహరవీరమల్లు ప్రోమో వచ్చేస్తోంది..!
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పేరు చెబితేనే మా అన్నయ్యా.. మా అన్నాయ్యా అంటూ నెత్తిన పెట్టుకుంటారు. ఇంకా ఈయన సినిమా వస్తుందంటే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటి వాళ్ల కోసమే ఓ అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ వాళ్లు ఓ ట్వీట్ ను విడుదల చేశారు. అదిరిపోయే అప్డేట్తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. హరిహర వీరమల్లు ప్రోమో వచ్చేది ఎప్పుడో చెప్పి సర్ ప్రైజ్ చేశారు.
Pawan Kalyan Instagram Record: Excellent..!! పవన్ ఎంట్రీతో ఇన్ స్టాలో రికార్డులు బద్దలు..
పవర్ స్టార్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్..
పవన్ కళ్యాణ్ ను ఇప్పటి వరకు చాలానే జానర్లలో చూశాం. కానీ పీరియాడిక్ సినిమాల్లో మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. అయితే ఈ కోరిక నెరవేర్చేందుకు డైరెక్టర్ క్రిష్ ఓ సూపర్ కథను రాసుకున్నారు. అలాగే పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టిని సినిమాను కూడా లాక్ చేసేశారు. లాక్ ఏంటి.. చాలా వరకు సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండంతో మరిన్ని బజ్ ఏర్పడింది.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ..బిజీ..
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల నిధి.. నిధి అగర్వాల్ హీరోయిన్ చేస్తోంది. ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరిహర వీరమల్లు చిత్రాన్నని తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగలు సాయన్న అనే బందిపోటు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు వేర్వేరు యూనివర్స్‌లో ఈ కథ సాగుతుందని కూడా సమాచారం. అయితే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడంతో ఈ సినిమా నుంచి సంవత్సర కాలంగా ఎలాంటి అప్ డేట్ లేదు.
కానీ తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మూవీ టీం. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిందని, త్వరలోనే ప్రోమో కూడా వచ్చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి చోట్ల మా ప్రతిష్టాత్మక సినిమా హై ఎండ్ వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని కూడా స్పష్టం చేసింది. ప్రోమో కచ్చితంగా అభిమానుల అంచనాలు తాకుతుందని.. సినిమాపై మరింత బజ్ ఏర్పడేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రోమో విడుదల తేదీన మరో వారం రోజుల్లో తెలిపే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరనగుంది అనేది.
Discussion about this post