Pawan Kalyan Instagram Record : Excellent..!! పవన్ ఎంట్రీతో ఇన్ స్టాలో రికార్డులు బద్దలు..
హీరోల క్రేజ్ గురించి మాట్లాడుకోవాల్సి ముందుగా గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ పవన్ రికార్డులు మాములుగా ఉండవు. హిట్టూ ఫ్లాపులకు అతీతమైన హీరో పవన్ కళ్యాణ్ అనడం అతిశయోక్తి కాదు. ఒకవైపు రాజకీయాల్లో దూసుకుపోతూనే.. వరుస సినిమాలతో రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఫ్యాన్స్ కి మరింత చేరువయ్యాడు.
Varahi VijayaYatra : పేదలకు, పెత్తందారులకు మధ్య క్లాస్ వార్..
Varahi VijayaYathra : భీమవరంలో జన ప్రభంజనం.. జనసైనికుల హర్షాతిరేకాల మధ్య పవన్ కళ్యాణ్ రోడ్ షో..
ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్ లో మాత్రమే అందుబాటులో ఉన్న పవన్ ఈ రోజు ఇన్ స్టా లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవన్ సైలెంట్ గానే వచ్చినా.. మార్నింగ్ నుంచి రికార్డులు బద్దలవుతున్నాయి. గంట గంటకు పవన్ అకౌంట్ రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. పైగా ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే మిలియన్ కు పైగా యూజర్లు ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న ప్రభాస్ మిలియన్ ఫాలోవర్స్ ఫీట్ ని 23 రోజుల్లో సాధించగా పవన్ కేవలం 5, 6 గంటల్లోనే సాధించడం గమనార్హం.
అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఏపీ సీఎం జగన్ కు ఐదేళ్లలో 7లక్షల ఫాలోవర్స్ ఉండగా.. పవన్ ని 5 గంటల్లోనే 10లక్షల మంది ఫాలో అవుతున్నారు. పవన్ ఇన్ స్టా అకౌంట్ లో అసలు ఏ పోస్ట్ పెడతాడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక్క పోస్ట్ కూడా లేకుండా మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకోవడాన్ని బట్టే పవన్ మాస్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.